Trends

ఫోక్సో కేసు పెట్టారని ఆరుగురిని చంపి.. ఆపై ఏం చేశాడంటే..

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై నమోదైన పోక్సో కేసుకు ప్రతీకారంగా రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తులతో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో అతని భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు, పోక్సో కేసు బాధిత బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నానమ్మ రత్తమ్మ ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ వేధింపులకు పాల్పడడంతో బాధిత బాలిక కుటుంబం ఈ ఏడాది మే 16న అతనిపై పోక్సో కేసు నమోదు చేసింది. అనంతరం బెయిల్‌పై విడుదలైన రాజ్‌కుమార్, కేసు పెట్టారనే కక్షతో తెల్లవారుజామున బాధితుల ఇంటికి వెళ్లి ముందుగా బాలిక, ఆమె తల్లి, నానమ్మను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, ఇద్దరు చిన్నారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

హత్యల అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపినట్లు తెలిపినట్లు సమాచారం. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఒకే ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో దైవాలగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

This post was last modified on July 11, 2026 9:42 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago