నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. క్షణిక లైంగిక సుఖం కోసం ఏ తప్పూ చేయని భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య నిజంగానే పెరుగుతోంది. తనకు జీవితాంతం తోడుంటానని మెడలో తాళి కట్టి… ఆలనాపాలనా చూసుకుంటున్న భర్తలు…భార్యలకు ఆ తర్వాత భారమైపోతున్నారు. లైంగిక ఆనందం కోసం కొత్త వ్యక్తులను వెతుక్కుని అడ్డదారులు తొక్కేస్తున్న భార్యలకు భర్తలు నిజంగానే భారంగా మారుతున్నారు. భారమే కాదండోయ్… తమ అడ్డదారులకు అడ్డుగా కూడా ఉంటున్నారట. ఇలా భర్తలను చంపేస్తున్న భార్యలు ఒక్కొక్కరు ఒక్కో టెక్నిక్ ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా రక్తంలోకి హార్పిక్ (బాత్ రూం క్లీనింగ్ లిక్విడ్) ఎక్కించి మరీ తన భర్తను ఓ భార్య చంపేసింది.
దారుణాతి దారుణమైన ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ పట్టణం శివారులో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలల్లోకి వెళితే… నిజామాబాద్ కు చెందిన ప్రశాంత్ కు సంధ్యతో వివాహం జరిగింది. వీరి సంసారం సాఫీగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో సోమవారం ప్రశాంత్ విగత జీవిగా మరణించిన వైనం కలకలం రేపింది. ఇరుగుపొరుగు వారు సంధ్య ప్రవర్తనపై అనుమానం వచ్చి…ఆమెతో తరచూ కలుస్తున్న యువకుడిని పట్టుకుని తమదైన రీతిలో వివరాలు రాబట్టారు. సంధ్య కర్కశత్వం గురించి పెద్దగా తెలియని ఆ యువకుడు… కాస్తంత గద్దించగానే… మొత్తం స్టోరీని బయటపెట్టేశారు.
ప్రశాంత్ తో వివాహం అయిన తర్వాత సంధ్య లైంగిక వాంఛలు తీరలేదేమో… అనతి కాలంలోనే ఓ యువకుడితో వివాహేతర బంధం మొదటుపెట్టింది. భర్త ఇంటి వద్ద లేనప్పుడు… కొంతకాలం పాటు గుట్టుగానే ఈ కొత్త బంధాన్ని నెరపిన సంధ్య… ఈ కొత్త బంధం ఆనందం కలకాలం కావాలని తలచింది. నిత్యం ప్రియుడు తన వద్దే ఉండాలంటే… భర్త అడ్డు తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకు తానే భర్తను హతమార్చాలని ప్లాన్ వేసింది.
ఈ ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి భర్తకు ఫుల్లుగా మద్యం తాగించిన సంధ్య… ఇంటి మీదకు తీసుకెళ్లి ప్రియుడి సాయంతో భర్తను కిందకు తోసేసింది. మద్యం మత్తులో ఉన్న ప్రశాంత్ కింద పడిపోయినా ప్రాణాన్ని కోల్పోలేదు. దెబ్బలు అయితే తగిలాయి. దీంతో చికిత్స పేరిట నాటకం ఆడిన సంధ్య… భర్త నరాలకు ఏదో సెలైన్ ఎక్కిస్తున్నట్లుగా నాటకం ఆడింది.
సెలైన్ కు బదులుగా హార్పిక్ లిక్విడ్ ను ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించింది. నేరుగా నరాల్లోకి వెళ్లిన హార్పిక్ ప్రశాంత్ ప్రాణాలను హరించేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కింద పడిన కారణంగా తగిలిన దెబ్బలతోనే అతడు చనిపోయాడని సంధ్య చెప్పింది. అయితే ఆమె తీరుపై అనుమానం వచ్చిన వారు ఆమె ప్రియుడిని బంధించి అడగ్గా… అసలు కథ బయటపడిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates