Movie News

హ్యాట్రిక్ ముద్ర కోసం ఫ్లాపుని మర్చిపోవాలా

చెన్నై లవ్ స్టోరీ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో యూనిట్ సభ్యులు కొందరు వాడిన మాట ఒకటుంది. అదే కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ సక్సెస్ కొట్టాడని. క, కె ర్యాంప్ తర్వాత ఇప్పుడీ సినిమాతో దిగ్విజయంగా మూడు విజయాలు అందుకున్నాడని నిర్మాతతో సహా పలువురు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. అయితే చాలా తేలికగా ఒక నిజాన్ని విస్మరించి ఈ పాయింట్ హైలైట్ చేయడం సమర్ధనీయం కాదు. ఎందుకంటే కె రాంప్ కన్నా ముందు గత ఏడాది ఫిబ్రవరి నెలలో దిల్ రుబా అనే డిజాస్టర్ వచ్చింది.

అది క కన్నా ముందు స్టార్ట్ అయినా ఫిల్మోగ్రఫీ కౌంట్ మాత్రం విడుదల తేదీల ప్రకారమే చేస్తారు. దిల్ రుబాలాగా జనాల మైండ్ లో ఒక సినిమాని డిలీట్ చేయాలంటే భోళా శంకర్, వార్ 2, గేమ్ ఛేంజర్, రాజా సాబ్, హరిహర వీరమల్లు లాంటి వాటిని ఆయా హీరోలు తమ డేటా బేస్ లో తీసేయాలి. అది సాధ్యమేనా, కాదుగా. ఫ్లాపులు ఎవరికైనా సహజం. దిల్ రుబా కిరణ్ అబ్బవరం ఎప్పుడో ఒప్పుకుని లేట్ గా రిలీజ్ చేసిన సినిమా కావొచ్చు. అంతమాత్రాన కౌంట్ చేయొద్దంటే ఎలా.

ఆ మాటకొస్తే ఇదే దిల్ రుబా ఈవెంట్లు, ప్రెస్ మీట్లలో దాని గురించి టీమ్ అంతా గొప్పగా చెప్పుకున్న స్పీచులు చాలా ఉన్నాయి. సక్సెస్ అయినా కాకపోయినా ప్రతి సినిమా హీరో స్వంత అభిరుచి మీద జడ్జ్ చేసినవి కాబట్టి వాటి ఓటమిని కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప హ్యాట్రిక్ స్టాంప్ కోసం ఒక సినిమాని ఇగ్నోర్ చేయడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదనేది సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్లు. దిల్ రుబా ఇంపాక్ట్ కిరణ్ మీద ఆ స్థాయిలో ఉంది.

ఇదలా ఉంచితే చెన్నై లవ్ స్టోరీ యాభై కోట్ల గ్రాస్ దాటేసి ఇంకో వీకెండ్ కూడా స్టడీగా ఉంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఉధృతిలో దానికి దూరంగా ఉన్న సాధారణ ప్రేక్షకులకు కిరణ్ మూవీ ఒకటే ఛాయస్ అవుతోంది. లెనిన్ ఫైనల్ రన్ వచ్చేసింది. ఓటిటి డేట్ ఇచ్చేశారు కాబట్టి ఇంక చెప్పడానికి ఏం లేదు. జన నాయకుడు తెలుగులో దారుణంగా పోయింది. ఇవన్నీ చెన్నై లవ్ స్టోరీకి సానుకూలంగా పని చేస్తున్నాయి. ఫైనల్ నెంబర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.  

This post was last modified on August 2, 2026 11:47 am

Share

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

38 minutes ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

6 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

9 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

9 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago