సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. తమిళ స్టార్ హీరో సూర్య తొలిసారి ఒక తెలుగు దర్శకుడితో చేసిన ప్రాజెక్ట్ కావడంతో అనౌన్స్ మెంట్ నుంచే దీనిపై ఒక రకమైన బజ్ నెలకొంది. మరికొన్ని గంటల్లో ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. అయితే రెగ్యులర్ గా ఒక బిగ్ స్టార్ సినిమా వస్తోందంటే ప్రమోషన్ల విషయంలో ఉండే ఆర్భాటం కానీ, సోషల్ మీడియాలో నెల రోజుల ముందే కనిపించే రచ్చ గానీ ఈ సినిమా విషయంలో ఇంకా స్టార్ట్ కాలేదు.
మొదటి రోజు మొదటి ఆటే చూడాలనే ఫైర్ కూడా ఆడియన్స్ లో ఇంకా కనిపించడం లేదు. అలాగని ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి నెగిటివ్ బజ్ లేదు. గతంలో వెంకీ నుంచి చివరగా వచ్చిన సార్, లక్కీ భాస్కర్ సినిమాల రన్ ని ఒక్కసారి గమనిస్తే.. ఈ రెండు సినిమాలు కూడా విడుదల ముందు పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్టైల్ ఎలివేషన్లు, అనవసరమైన స్టేట్మెంట్లు లేకుండా కూల్ గా వచ్చి పక్కా మౌత్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఊహించని వసూళ్లను రాబట్టాయి.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి ఈ మధ్యకాలంలో తక్కువ ప్రమోషనల్ హడావుడితోనే ఊహించని సక్సెస్ లూ, ప్రాఫిట్స్ అందించిన డైరెక్టర్ గా వెంకీ అట్లూరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా విషయంలోనూ సరిగ్గా అదే సీన్ రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ రోజు రాబోతున్న ట్రైలర్ తర్వాత అయినా సోషల్ మీడియాలో వాతావరణం మారుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఒకవేళ ట్రైలర్ కట్ కంప్లీట్ గా కనెక్ట్ అయితే ప్రమోషన్లు పుంజుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ట్రైలర్ నార్మల్ గా ఉంటే మాత్రం, మళ్లీ సినిమా రిలీజ్ వరకు వాతావరణం ఇలాగే సైలెంట్ గా కొనసాగే ఛాన్స్ ఉంది. పక్కా కమర్షియల్ హంగుల కంటే కూడా వెంకీ అట్లూరి రాసుకునే కథల్లోని కంటెంట్, హీరో క్యారెక్టరైజేషన్ ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి.
సూర్య లాంటి పవర్ హౌస్ పెర్ఫార్మర్ తో వెంకీ ఎలాంటి ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామాను ప్లాన్ చేశారనేది ట్రైలర్ తో కొంతవరకు క్లారిటీ రానుంది. తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ, తెలుగు ఆడియన్స్ కి కూడా సూర్య చాలా దగ్గరైన నటుడు. ఒకవేళ ట్రైలర్ తో పెద్దగా హడావుడి రాకపోయినా, అసలైన ఆట సినిమా విడుదలయ్యాకే మొదలవుతుందనేది ట్రేడ్ వర్గాల అంచనా. మొదటి ఆట ముగిసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చే టాక్ ఆధారంగానే బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
This post was last modified on August 2, 2026 12:14 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…