పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది. మొన్నటి లీగ్ మ్యాచ్ లో జరిగిన గొడవ వైభవ్ సూర్యవంశీలో ఎంత కసి పెంచిందో తాజా ఫైనల్ మ్యాచ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. గ్రౌండ్ లో తనను నోటికొచ్చినట్లు మాటలన్న లంక ఆటగాళ్లపై వైభవ్ తన బ్యాట్ తోనే రివెంజ్ తీర్చుకున్నాడు. ఈ దెబ్బతో భవిష్యత్తులో ఈ కుర్రాడిని గెలకాలి అంటేనే ప్రత్యర్థి టీమ్స్ భయపడేలా ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు.
అసలు ఇది 50 ఓవర్ల వన్డే మ్యాచ్ నేనా లేక టీ10 లీగా అన్నట్లుగా వైభవ్ చెలరేగిపోయాడు. క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేశాడంటే అతను ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. అందులో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయంటే బౌలర్లకు అస్సలు ఊపిరి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదని క్లియర్ గా తెలుస్తోంది. ఆడిన ప్రతి షాట్ లోనూ మొన్నటి అవమానానికి బదులు తీర్చుకోవాలనే కోపం కనిపించింది.
ఈ దెబ్బతో లిస్ట్ A క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా వైభవ్ సంచలనం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లోనే యాభై మార్క్ దాటేసి మైండ్ బ్లాక్ చేశాడు. వైభవ్ కొడుతున్న దెబ్బలకు స్కోరు బోర్డు రాకెట్ లా దూసుకెళ్లింది. లంక కెప్టెన్ ఎన్ని రకాలుగా ఫీల్డింగ్ మార్చినా, బౌలర్లను రొటేట్ చేసినా ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను మాత్రం ఏమాత్రం ఆపలేకపోయారు. అప్పటిదాకా ఎగిరెగిరి పడ్డ ఆటగాళ్లు గ్రౌండ్ లో సైలెంట్ గా చూస్తుండిపోయారు.
సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో సహన్ అరాచ్చిగే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. వంద రన్స్ టార్గెట్ మిస్ చేసుకున్నాడు అనే బాధ ఫ్యాన్స్ లో ఉన్నా, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేశాడు. అతను అవుట్ అయ్యే టైంకి టీమిండియా స్కోరు పది ఓవర్ల లోపే 130 దాటేసిందంటే ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్కోరు బోర్డు చూస్తే అతనెంత డేంజరస్ ప్లేయరో ఇట్టే పసిగట్టవచ్చు.
టాలెంట్ తో పాటు అగ్రెషన్ ఉన్న ప్లేయర్ ను రెచ్చగొడితే గ్రౌండ్ లో ఎలాంటి సునామీ వస్తుందో చెప్పడానికి ఈ ఇన్నింగ్స్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. పాత గొడవను మైండ్ లో పెట్టుకుని, తన ఫోకస్ ను ఎక్కడా దారి తప్పనివ్వకుండా బ్యాట్ తోనే లంక టీమ్ కు గట్టి బుద్ధి చెప్పాడు. విదేశీ పిచ్ లపై తడబడతాడు అనుకున్న వాళ్ళందరికీ తన పవర్ హిట్టింగ్ తో దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చాడు. కవ్వింపులకు పోతే వైభవ్ ఎంత భయంకరంగా మారతాడో ఈ మ్యాచ్ తో క్రికెట్ ప్రపంచం మొత్తానికి ప్రూవ్ అయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates