సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం చూసినప్పుడు.. వయోజనులు (మేజర్లు) అయిన వారు తమ సమ్మతితో వేశ్యావృత్తిని నిర్వహిస్తుండటం నేరం కాదని స్పష్టం చేసింది.
అదే సమయంలో వ్యభిచార గృహం నడపటం.. ఇతరుల సంపాదన మీద మీద బతకటం.. బహిరంగ ప్రదేశాల్లో విటులను ఆకర్షించటం.. మైనర్లను బలవంతంగా ఇందులోకి దించటం మాత్రం చట్టప్రకారం శిక్షార్హమైన నేరాలుగా పేర్కొంది.
భారతీయ చట్టాల ప్రకారం ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఒక వయోజనుడు (మేజర్) తన పూర్తి సమ్మతితో వేశ్యావృత్తిని నిర్వహించటం నేరం కాదని స్పష్టం చేసింది.
తాజా తీర్పులోని సున్నితమైన అంశం ఏమంటే.. స్వచ్ఛందంగా వేశ్యావృత్తిలో ఉన్న వారికి.. అక్రమ రవాణాకు గురై బలవంతంగా వేశ్యావృత్తిలో కూరుకుపోయిన వారిని ఒకేలా చూడకూడదన్న విషయాన్ని సుప్రీం స్పష్టం చేసింది. తమ ఇష్టంతో వేశ్యావృత్తిలో ఉన్న వారిని ట్రాఫికింగ్ బాధితులుగా చూడొద్దని స్పష్టం చేసింది.
అలాంటి వారిపై అక్రమ రవాణా.. ఇతర సీరియస్ క్రిమినల్ కేసులు పెట్టి వేధించొద్దని పేర్కొంది. అంతేకాదు ట్రాఫికింగ్ బాధితులకు గౌరవప్రదమైన పునరావాసం పొందే హక్కు ఉంటుందని తేల్చింది. శుక్రవారం జస్టిస్ పార్థీవాలా.. జస్టిస్ ఆర్.మహదేవన్ లతో కూడిన ధర్మాసనం 22 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన ఒక సమగ్ర బాధితుల రక్షణ ప్రణాళికను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ను స్పష్టంగా పేర్కొంది.
ఇంతకూ సుప్రీంకోర్టు తీర్పులో కీలక అంశాలివే..
This post was last modified on May 30, 2026 10:21 am
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…
వైసీపీ అధినేత జగన్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారో.. ఆ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి…
రెండేళ్ల క్రితం వచ్చిన లక్కీ భాస్కర్ ఓ మోస్తరు అంచనాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్…
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద, రెండు వందల రోజులు ఆడటం మాములు విషయం. ప్రేమాభిషేకం, అడవి రాముడు ఏడాది…