Movie News

వరప్రసాద్ గారికి మాత్రమే సాధ్యమయ్యిందే

ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద, రెండు వందల రోజులు ఆడటం మాములు విషయం. ప్రేమాభిషేకం, అడవి రాముడు ఏడాది పాటు థియేటర్ల నుంచి కదల్లేదు. సమరసింహారెడ్డి, ఇంద్ర లాంటివి సిల్వర్ జూబ్లీ వరకు హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. సింహాద్రి, ఖుషి, ఒక్కడు, కలిసుందాం రా రికార్డుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. ప్రేమికుడు లాంటి డబ్బింగ్ చిత్రాలు సైతం శతదినోత్సవ షీల్డులు ఇచ్చిన ట్రాక్ రికార్డు టాలీవుడ్ సొంతం. ఇదంతా గడిచిపోయిన గతం.

ఈ ట్రెండ్ ఎప్పుడో అంతరించి పోయింది. ఇంటర్ నెట్, 5జి, ఓటిటి, స్మార్ట్ టీవీలు వచ్చాక లాంగ్ రన్ కలగా మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప., కెజిఎఫ్ లాంటి అల్ టైం హిట్స్ ఏవీ వంద రోజులు ఆడలేదు. త్వరగా వేల కోట్లు పోగేసుకుని వెళ్లిపోయాయి. కానీ జనవరిలో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు కడప జిల్లాలోని ఎర్రగుంట్ల అనే చిన్న ఊరిలో ఆరు నెలలకు పైగా ఆడుతూనే ఉండటం విడ్డూరమనిపించినా ఇది నిజం. ప్రకటన కూడా వచ్చింది.

నిజంగా 200 రోజులు డైలీ నాలుగు ఆటలు చొప్పున అన్నీ ఆడించారా అంటే ఫ్యాన్స్ ఔననే అంటున్నారు. గతంలో లెజెండ్, మగధీర, పోకిరి లాంటివి సంవత్సరం పాటు ఆడించారు. కానీ వాటిలో జనం లేకుండా ఆపేసిన షోలు చాలా ఉన్నాయని యాంటీ ఫ్యాన్స్  పరస్పరం కామెంట్స్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన శంకరవరప్రసాద్ గారు ఈ ఫీట్ సాధించడం చూస్తుంటే రికార్డు కోసం రన్ చేశారా లేక నిజంగా కలెక్షన్ వచ్చిందా అంటే, ఏమో సమాధానం చెప్పలేం.

ఒకవేళ వాస్తవమే అయితే సంతోషించాల్సిన పరిణామమే. ఎందుకంటే ఓటిటిలో వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా 200 రోజులు థియేటర్లో ఉందంటే ఊహకందని రికార్డు. ఆ మధ్య వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిని పోటాపోటీగా ఒక కేంద్రలో హండ్రెడ్ డేస్ ఆడించిన సంఘటన అప్పుడప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడీ వరప్రసాద్ ఫీట్ ని మళ్ళీ ఎవరితో దాటిస్తారో దానికి ఏ ఊరి థియేటర్ వేదికగా మారుతుందో చూడాలి. 

This post was last modified on July 30, 2026 4:36 pm

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

36 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

50 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

3 hours ago