తెలంగాణలో గడిచిన నాలుగు రోజులుగా సాగిన మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ వ్యాప్తంగా మందు అమ్మకాలు మా జోరుగా సాగినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు వేడుకలపై నియంత్రణ.. బార్లు.. పబ్బులపై పరిమితులు ఉన్న వేళలోనూ.. భారీగా అమ్మకాలు సాగటం ఆసక్తికరంగా మారింది.
డిసెంబరు నెలలోని చివరి నాలుగు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా రూ.1068.4 కోట్ల మద్యం.. బీరు అమ్మకాలు సాగినట్లుగా లెక్కలు తేలాయి. డిసెంబరు 31 రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఓకే చెప్పిన నేపథ్యంలో అమ్మకాలు భారీగా సాగాయి. రాష్ట్రంలో2216 మద్యం దుకాణాలు.. వెయ్యికి పైగా బార్లు.. క్లబ్బులు.. హోటళ్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగినట్లుగా చెబుతున్నారు.
మద్యంఅమ్మకాల కారణంగా ఒక్క డిసెంబరు నెలలో రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం రూ.2,714.76 కోట్లు. ఇంత భారీగా ఇటీవల కాలంలో ఎప్పుడూ రాలేదట. మద్యం అమ్మకాల పుణ్యమా అని.. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని చెప్పాలి. దీంతో.. లాక్ డౌన్.. కరోనా కారణంగా నీరసించిన బొక్కసం కాసులతో కళకళలాడుతోందని చెప్పక తప్పదు.
This post was last modified on January 1, 2021 7:32 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…