Trends

ఇంట్లో నేపాలీలు ఉంటే జాగ్రత్త

రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ ఇచ్చిన నేపాలీలు తదనంతరం ఇళ్లల్లో పని మనుషులుగా మారిపోయారు. ఆపై పనిమనుషులుగా ఉంటూనే ఆయా ఇళ్లల్లోని విలువైన వస్తువులను గుర్తించి వాటిని చోరీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ఇళ్లల్లో ఉంటున్న వారిని నేపాలీలు చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్నాయి. వెరసి తెలుగు రాష్ట్రాల్లో నేపాలీలంటేనే భయం వ్యక్తమవుతోంది.

మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రశాసన్ నగర్ లో రిటైర్డ్ ఐపీఎస్ అదికారి వినయ్ రంజన్ రే సతీమణిని హత్య చేసిన నేపాలీ ముఠా… ఇంటిలోని విలువైన వస్తువుతో ఉడాయించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఓ రిటైర్డ్ ఐపీఎస్ బార్య కావడంతో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు వారిని పట్టుకునే క్రమంలో ఉన్నారు.

ఈ ఘటన మరువకముందే… హైదరాబాద్ శివారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు తీయొద్దని బాదితులు వేడుకోవడంతో వారి ఇంటిలోని విలువైన వస్తువులను తీసుకుని.. బాధితులకు మత్తు మందు ఇచ్చిన నేపాలీ ముఠా పరారైంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే…కౌకూరు గోల్ప్ ఎన్ క్లేవ్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68) తన భార్య విజయ లక్ష్మీ (58)తో కలిసి ఉంటున్నారు. కొంతకాలం క్రితం నేపాల్ కు చెందిన ఓ జంట వీరి ఇంటిలో పనికి కుదిరారు. కొన్ని రోజుల తర్వాత వారి బంధువునని చెప్పిన మరో మహిళ ఆ ఇంటిలోకి చేరింది.

ఈ క్రమంలో సోమవారం రాత్రి తర్వాత వచ్చిన మహిళ జన్మదినముందని, వేడుకలు జరుపుకుంటామని చెప్పి వృద్ద దంపతుల వద్ద అనుమతి తీసుకున్నారు. బర్త్ డే వేడుకల పేరిట సోమవారం రాత్రి మరో ముగ్గురు వారి బంధువులమంటూ ఆ ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా బర్త్ డే కోసం కేక్ ను వృద్ద దంపతుల ద్వారానే కొనుగోలు చేసిన నేపాలీ ముథా.. కేక్ ను కట్ చేస్తున్నట్లు నటించి… వృద్ధ దంపతుల వెనక్కెళ్లి వారి చేతులను కట్టి వేసి తమ ప్రతాపం చూపబోయారు. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన వృద్ధ దంపతులు తమను ఏమీ చేయవద్దని, మీకు ఏం కావాలంటే అవి తీసుకోండి అని చెప్పడంతో వారిని వదిలేసిన నేపాలీ ముఠా ఇంటిలోని బంగారం, డబ్బును తీసుకుంది.

ఆ తర్వాత వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి… ఇంటికి అన్ని గేట్లకు తాళాలు వేసి ఆటోలో పరారైంది. మత్తు దిగిన తర్వాత జరిగిన దానిని గుర్తుకు తెచ్చుకున్న మురళీధర్… కిటికీలో నుంచి అటుగా వెళుతున్నవారిని కేక వేసి పిలిచి తలుపులు తెరిపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

This post was last modified on May 13, 2026 1:18 pm

Share

Recent Posts

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

56 minutes ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

2 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

3 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

3 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

4 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

5 hours ago