Political News

ఫ్యూచర్ లేని నేత.. ఫ్యూచర్ సిటీ: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు గుప్పించారు. రాష్ట్రంలో ఫ్యూచర్ లేని పార్టీకి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాంటి ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడుతున్నారట అని ఎద్దేవా చేశారు. దీనికిగాను 16 వేల ఎకరాలను సేకరించి తన వారికి పంపిణీ చేయాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, తన అనుకూల పెట్టుబడిదారుల కోసం పేదల భూములను లాక్కుంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.

అక్రమాలకు కేరాఫ్

రేవంత్ రెడ్డి పాలన అక్రమాలకు కేరాఫ్‌గా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ శాఖలు అవినీతిమయంగా మారాయని విమర్శించారు. గత నెల రోజుల్లోనే నలుగురు తహసీల్దార్లు అవినీతిలో చిక్కుకున్నారని, పోలీసులు కూడా ఇదే దారిలో ఉన్నారని అన్నారు. వీరంతా పైకి సంచులు మోసేందుకు బలి అవుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నెలకు నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పిన కేటీఆర్, ఆయన అలా ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.

శాశ్వతం కాదు

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కానీ గతంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని వ్యాఖ్యానించిన విషయం ఈ సందర్భంలో ప్రస్తావనార్హం. రాష్ట్రంలో అప్రజాస్వామికంగా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిటీలో దోమల బెడద

హైదరాబాద్ నగరంలో సాయంత్రం 5 గంటలు అయితే దోమలు కుట్టికుట్టి ఇబ్బంది పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. దోమలను కూడా నియంత్రించలేని రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానంటూ పేదల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ఆక్రమణలు, దందాలకు తెరతీశారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తామని చెప్పి ఇప్పుడు అవే భూములను వాడుకుంటున్నారని అన్నారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేసిన వారు సీతక్క, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.

This post was last modified on April 11, 2026 9:49 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

53 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago