Trends

వేల కోట్లు ఉన్నా కష్టాన్నే నమ్ముకున్న వారసుడు

ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్లలో సచిన్ ఒకరు. వేల కోట్ల ఆస్తి. ఇక అతనికి వారసుడిగా అర్జున్ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు లేదా ఏదైనా బిజినెస్ చూసుకోవచ్చు. కానీ, అతను మాత్రం క్రికెట్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులోకి మారాడు. కానీ, అక్కడ కూడా పరిస్థితి ఏమీ మారలేదు. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లకు వాటర్ బాటిల్స్, టవల్స్ అందిస్తూ ఒక సాధారణ ప్లేయర్ లాగా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.

నిజానికి సచిన్ తలచుకుంటే తనకున్న పలుకుబడితో అర్జున్ కు ఏదో ఒక టీమ్ లో ఛాన్స్ ఇప్పించగలడు. కానీ, సచిన్ కు అలాంటి గుణం లేదు, అర్జున్ కూడా అలా ఇష్టపడడు. తండ్రి నుంచి టాలెంట్ ను అంతగా అందుకోలేకపోయినా, క్రమశిక్షణ, హార్డ్ వర్క్ ను మాత్రం అర్జున్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాడు. వేల కోట్లకు వారసుడైనా, కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ కు అమ్ముడైనా, ఆ డబ్బు అతనికి చాలా చిన్నదైనా సరే, జట్టులో ఒక సాధారణ ప్లేయర్ గా కష్టపడటం అతనిలోని డెడికేషన్ ను చూపిస్తోంది. 

గతంలో ముంబై తరపున కొన్ని మ్యాచ్ లు ఆడినా ఆల్ రౌండర్ గా పెద్దగా క్లిక్ కాలేదు, బౌలింగ్ లో వేగం లేకపోవడం అతనికి పెద్ద మైనస్ గా మారింది. ప్రస్తుతం అర్జున్ వయసు 26 ఏళ్లు. క్రికెట్ కెరీర్ లో ఇది చాలా కీలకమైన సమయం. ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ తో లక్నోకు కీలకమైన మ్యాచ్ ఉంది. ప్రాక్టీస్ లో తీవ్రంగా శ్రమిస్తున్న అర్జున్ కు ఈ మ్యాచ్ లోనైనా ఛాన్స్ దక్కితే తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. నెట్స్ లో అతను వికెట్లను ఎగురగొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సమాజంలో నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో, అర్జున్ టెండూల్కర్ ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు. తండ్రి పేరు చెప్పుకుని కాకుండా, తన సొంత ప్రతిభతో జట్టులోకి రావాలని చూస్తున్నాడు. అర్జున్ హార్డ్ వర్క్ ను నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.

“నెపోటిజం ను వాడుకోకపోవడానికి ఇది ఒక మంచి ఉదాహరణ” అంటూ అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. వేల కోట్లు ఉన్నా, బెంచ్ మీద కూర్చుని జట్టు కోసం డ్రింక్స్ మోయడం సామాన్యమైన విషయం కాదని మరికొందరు అంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ వారసుడు ఎలా నిలదొక్కుకుంటాడో చూడాలి.

This post was last modified on April 5, 2026 7:00 am

Share

Recent Posts

సీట్లన్నీ గెలిచినా ఈవీఎంలకు వ్యతిరేకమే

ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…

16 minutes ago

కీలక జిల్లాలు చేజారిపోతున్నాయి జగన్

రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…

43 minutes ago

డైరెక్ట‌ర్ ఏడిస్తే… హీరోనే డైరెక్ట్ చేసుకున్నాడ‌ట‌

కొన్నిసార్లు ద‌ర్శ‌కులు క‌థ చెప్పినంత బాగా సినిమా తీయ‌లేక‌పోతుంటారు. అందుకు అనుభ‌వ లేమి కూడా కార‌ణం కావ‌చ్చు. లేదంటే రాత…

1 hour ago

ఖైరతాబాద్ లో కవిత? చీల్చడానికేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…

1 hour ago

జైలుకే ఎక్కువ సార్లు వెళ్ళాను

నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…

1 hour ago

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

4 hours ago