దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి.
ప్రస్తుతం వారికి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కారు చక్రం ఒక్కసారికి ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని మరో ప్రచారం జరుగుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తమ స్నేహితులను విమానాశ్రయంలో డ్రాప్ చేసి వస్తుండగా నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.
This post was last modified on March 23, 2026 5:02 pm
ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…
రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…