Trends

హిందూ ముస్లిం భాయ్ భాయ్.. ఇది కదా ఇండియా అంటే

రంజాన్ సందర్భంగా జైపూర్‌లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం కనువిందు చేసింది. హిందూ–ముస్లిం ఏకతా సమితి ఆధ్వర్యంలో, ఈద్‌గాహ్‌లో నమాజ్ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులపై హిందూ సమాజానికి చెందిన సభ్యులు పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్య దేశవ్యాప్తంగా సోదరభావం, సామాజిక ఐక్యతకు బలమైన సందేశాన్ని అందించింది.

ఈద్ ఉదయం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తుల్లో ఈద్‌గాహ్‌కు చేరుకుని ప్రశాంత వాతావరణంలో నమాజ్ నిర్వహించారు. నమాజ్ పూర్తైన వెంటనే అక్కడ ఉన్న హిందూ సమాజ సభ్యులు నమాజ్ చేస్తున్న వారిపై పూల వర్షం కురిపించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. పరస్పర ప్రేమ, గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచింది.

ఈ సందర్భంగా హిందూ–ముస్లిం ఏకతా సమితికి చెందిన రాజేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, “అందరికీ ఈద్ శుభాకాంక్షలు. మతాల మధ్య ఐక్యత ఎప్పటికీ కొనసాగాలి. కొందరు విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తప్పు.

రాముడు లేకుండా రమజాన్ లేదు, ఈద్ లేకుండా దీపావళి లేదు. మనమంతా ఒక్కటే అన్న సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం” అని పేర్కొన్నారు. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈద్‌గాహ్‌కు చేరుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, సౌహార్దం, సోదరభావాన్ని కాపాడాలని అందరూ పిలుపునిచ్చారు.

This post was last modified on March 21, 2026 8:09 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

18 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago