మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ ‘ఎల్ మెంచో’ కథ ముగిసింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఒక భారీ సైనిక ఆపరేషన్‌లో ఇతను తీవ్రంగా గాయపడి మరణించినట్లు మెక్సికో రక్షణ మంత్రి రికార్డో ట్రెవిల్లా ధృవీకరించారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఇతన్ని పట్టుకోవడం మెక్సికో ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
అయితే ఇన్నాళ్లూ చిక్కని ఈ గ్యాంగ్‌స్టర్ చివరకు తన గర్ల్‌ఫ్రెండ్ వల్ల దొరికిపోయాడు. మెంచో భాగస్వామికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి కదలికలను అధికారులు గమనించారు. ఆ మహిళను అనుసరిస్తూ వెళ్లిన నిఘా వర్గాలు చివరకు జాలిస్కో రాష్ట్రంలోని ఒక మారుమూల పర్వత ప్రాంతంలో ఉన్న రహస్య స్థావరాన్ని కనుగొన్నాయి. ఆమె అక్కడి నుండి వెళ్లిన తర్వాత కూడా లోపల భారీ భద్రత ఉండటంతో, మెంచో అక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్న సైన్యం మెరుపు దాడికి ప్లాన్ చేసింది.
హెలికాప్టర్లు, సాయుధ బలగాలతో ఈ ఆపరేషన్ మొదలైంది. సైన్యం రాకను గమనించిన మెంచో అనుచరులు కాల్పులు జరుపుతూ అతన్ని అడవిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బలగాల కాల్పుల్లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగానే దారిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఆపరేషన్‌లో అమెరికా కేవలం ఇంటెలిజెన్స్ సమాచారాన్ని మాత్రమే ఇచ్చిందని, మెక్సికో సైన్యం సొంతంగానే ఈ దాడిని పూర్తి చేసిందని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పష్టం చేశారు. మెంచో మరణ వార్త తెలిసిన వెంటనే అతని గ్యాంగ్ ‘CJNG’ సభ్యులు మెక్సికో అంతటా విధ్వంసానికి దిగారు. రోడ్లను బ్లాక్ చేయడం, వాహనాలను తగలబెట్టడం, దుకాణాలపై దాడులు చేస్తూ భీభత్సం సృష్టించారు. ఈ గొడవల్లో సుమారు 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు, 30 మంది గ్యాంగ్ సభ్యులు మరణించారు.
పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా దళాలను రంగంలోకి దించింది. ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మెంచో స్థాపించిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) మెక్సికోలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికాకు ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్స్ తరలించడంలో ఇతనిదే ప్రధాన బాధ్యత. మెంచో మరణం ఆ మాఫియా నెట్‌వర్క్‌కు కోలుకోలేని దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 24, 2026 12:27 pm
ట్రాఫిక్ చలాన్ వచ్చిందంటే వెంటనే కట్టేవాళ్లు కొందరైతే.. నెలలు, ఏళ్లుగా పెండింగ్‌లో పెట్టేవాళ్లు కూడా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా వసూలు…
ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…
రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…