సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా మరీ పాతకాలం ఫార్ములాని ఎంచుకోవడం బాక్సాఫీస్ ఫలితాన్ని ప్రతికూలంగా శాసించింది.. దీనికి తోడు స్పైడర్ మ్యాన్ ప్రభంజనాన్ని తక్కువ అంచనా వేయడం ఇంకో దెబ్బ కొట్టింది. మహేష్ బాబు రాజకుమారుడు రిలీజ్ డేట్ సెంటిమెంట్ కోసమని తీసుకున్న నిర్ణయం అసలుకే చేటు చేసింది. దానికి తోడు మహేష్ ప్రత్యేకంగా ప్రమోట్ చేయకపోవడం ఇంకో మైనస్.
ఇదిలా ఉండగా మంగాపురం హీరోకి మంగళవారం దర్శకుడు నేర్పించిన పాఠం ఒకటుంది. ఇంత చిన్న వయసులో కమర్షియల్ కథల జోలికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. వాటికి కొంచెం టైం తీసుకోవాలి. మహేష్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కృష్ణ గారి ఫాలోయింగ్ భద్రంగా ఉంది. కాబట్టి లేలేత వయసులో మహేష్ ఫైట్లు చేసినా, డాన్సులు ఆడినా ఫ్యాన్స్ తన్మయత్వంలో చూశారు. దానికి తగ్గట్టే రాఘవేంద్రరావు వండిన మసాలా వంటకం కలెక్షన్లు తీసుకొచ్చి సూపర్ హిట్ అందించింది.
అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. జయకృష్ణకు సబ్జెక్టు సెలక్షన్ చేసే క్రమంలో కుటుంబ సభ్యులు పొరపడింది ఇక్కడే. మంగాపురం కాకుండా ఏదైనా సింపుల్ లవ్ స్టోరీతో ప్రయాణం మొదలుపెట్టి ఉంటే ఇంకాస్త బెటర్ ఇంప్రెషన్ వచ్చేది. పైగా డైరెక్టర్ అజయ్ భూపతిది డిఫరెంట్ స్టైల్. ఆరెక్స్ 100లో లస్ట్ లవ్ ని చూపిస్తే మంగళవారంలో మూఢనమ్మకాలకు కామానికి ముడి పెట్టి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఆయన ఆలోచనా శైలి చాలా విభిన్నంగా సాగుతుంది.
అలాంటి దర్శకుడు శ్రీనివాస మంగాపురం లాంటి స్టోరీ హ్యాండిల్ చేయడం విచిత్రం. సరే తొలి అడుగు తడబడినా జయకృష్ణకి ఏం మించిపోలేదు. నిర్మాతలు రెడీగా ఉన్నారు. దర్శకులూ దొరుకుతారు. ఇకపై ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కేవలం కాంబోలతో పని జరగదు. మార్నింగ్ షో వరకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నిలబెట్టాల్సింది కంటెంటే. ఇది గుర్తుంచుకుని జయకృష్ణ కెరీర్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న వయసు కాబట్టి బోలెడు ఫ్యూచర్ ఉంది.
This post was last modified on August 4, 2026 9:32 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…