ఐపీఎల్లో ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోనీ సంపాదన రూ.200 కోట్ల మార్కును దాటింది. 2008లో రూ.6 కోట్లతో మొదలైన అతడి కెరీర్ 2026లో రూ.4 కోట్ల రిటెన్షన్‌తో ముగిసింది. మధ్యలో ఒక్కో సీజన్‌కు రూ.15 కోట్ల వరకు అందుకున్నాడు. ఇప్పుడు ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్‌గా మారాడు. అయితే ఇన్నేళ్లు భారీ జీతం అందుకున్న ధోనీకి కొత్త బాధ్యతల్లో ఎంత పారితోషికం ఇవ్వబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
2008లో జరిగిన మొదటి ఐపీఎల్ వేలంలో ధోనీని చెన్నై రూ.6.03 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అదే అత్యధిక ధర. ఆ తర్వాత అతడి జీతం క్రమంగా పెరిగింది. 2014, 2015 సీజన్లలో రూ.12.5 కోట్ల చొప్పున అందుకున్నాడు. చెన్నైపై నిషేధం కారణంగా 2016, 2017లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ తరఫున ఆడినప్పుడు కూడా అంతే మొత్తం తీసుకున్నాడు. 2018లో చెన్నై తిరిగి రావడంతో ధోనీ జీతం రూ.15 కోట్లకు పెరిగింది. 2021 వరకు అదే కొనసాగింది.
2022 నుంచి 2024 వరకు ఒక్కో సీజన్‌కు రూ.12 కోట్ల చొప్పున అందుకున్న ధోనీ, 2025లో మాత్రం రూ.4 కోట్లకే అంగీకరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తయిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకునే నిబంధనను చెన్నై ఉపయోగించుకుంది. 2026లోనూ అదే ధరకు ధోనీని కొనసాగించింది. లెక్కల ప్రకారం 2008 నుంచి 2026 వరకు అతడి మొత్తం ఐపీఎల్ కాంట్రాక్టుల విలువ రూ.200.72 కోట్లు.
అయితే మెంటార్‌గా ధోనీ జీతం ఎంత ఉంటుందనే విషయం. ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆటగాళ్లకు వర్తించే వేలం, రిటెన్షన్ నిబంధనలు మెంటార్ ఒప్పందాలకు వర్తించవు. అందువల్ల సీఎస్కే అతడితో ప్రత్యేకంగా ఆర్థిక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. లెక్క కోట్లల్లోనే ఉంటుందనే టాక్ ఉంది. మరోవైపు ధోనీ రిటైర్మెంట్తో చెన్నైకి వేలం బడ్జెట్లో రూ.4 కోట్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీకి ఆటగాడిగా రూ.4 కోట్ల రిటెన్షన్ కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తం ప్లేయర్ల కోసం ఉపయోగించుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates