Trends

ఇక ఓలా, ఉబేర్ పని అయిపోయినట్లేనా?

దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్ లాంటి ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి ఇది గట్టి చెక్ పెట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ఉన్న సహకార నమూనా కావడం, డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఈ యాప్ కి ఉన్న ప్లస్ పాయింట్. మార్కెట్ లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన దిగ్గజ సంస్థలకు ఇది చమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ భారత్ ట్యాక్సీలో డ్రైవర్లే బాస్ లు. ఇక్కడ డ్రైవర్లను కేవలం పనివాళ్లలా కాకుండా ‘సారథులు’గా గుర్తిస్తారు. రిజిస్టర్ అయిన ప్రతి డ్రైవర్‌కు ఈ సహకార సంస్థలో ఐదు షేర్లు కేటాయించడం విశేషం. అంటే సంస్థ లాభాల్లో వారు కూడా భాగస్వాములే అన్నమాట. ప్రైవేట్ సంస్థల్లో ఇలాంటి ఓనర్ షిప్ దొరకదు కాబట్టి, మెజారిటీ డ్రైవర్లు ఇప్పుడు భారత్ ట్యాక్సీ వైపు క్యూ కడుతున్నారు. దీనివల్ల సహజంగానే ఓలా, ఉబేర్ వంటి ప్లాట్‌ఫామ్స్‌పై డ్రైవర్ల కొరత ఏర్పడే ఛాన్స్ ఉంది.

డ్రైవర్లకు ఆర్థికంగా ఈ యాప్ పెద్ద ఊరటనిస్తోంది. సాధారణంగా ప్రైవేట్ యాప్స్ ప్రతి రైడ్ మీద 20 నుండి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తాయి. కానీ ఇక్కడ డ్రైవర్లు ఒక్క రూపాయి కూడా కమిషన్ కట్టాల్సిన పనిలేదు. కేవలం రోజుకు 30 రూపాయల ఫిక్స్డ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. దీనికి తోడు డ్రైవర్ల కోసం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నారు. ఇలాంటి సెక్యూరిటీ ఉండటంతో డ్రైవర్లు డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు, అది నేరుగా సర్వీస్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది.

కస్టమర్ల కోణంలో చూసినా భారత్ ట్యాక్సీ ఆకర్షణీయంగా ఉంది. మనకి బాగా చిరాకు తెప్పించే ‘సర్జ్ ప్రైసింగ్’ ఇందులో ఉండదు. అంటే వర్షం పడినా, రద్దీ పెరిగినా రేట్లు విపరీతంగా పెంచే దోపిడీ ఉండదని మేనేజ్మెంట్ హామీ ఇచ్చింది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే చార్జీలు కూడా 30 శాతం వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. జేబుకి చిల్లు పడదు అని తెలిస్తే జనం కచ్చితంగా భారత్ ట్యాక్సీ వైపే మొగ్గు చూపుతారు. ఇది ఓలా, ఉబేర్ యూజర్ బేస్ ని గట్టిగా దెబ్బతీస్తుంది.

అయితే ఓలా, ఉబేర్ పని ఇప్పుడే అయిపోయిందని చెప్పలేం కానీ, అవి తమ పద్ధతులు మార్చుకోక తప్పని పరిస్థితి భారత్ ట్యాక్సీ కల్పించింది. డ్రైవర్లకు కమిషన్లు తగ్గించి, కస్టమర్లకు సర్జ్ చార్జీల భారం తగ్గించకపోతే ప్రైవేట్ సంస్థలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఢిల్లీలో సక్సెస్ అయితే ఇదే మోడల్ దేశమంతా విస్తరిస్తుంది కాబట్టి, క్యాబ్ మార్కెట్ లో ఈ ‘భారత్’ అడుగు ఒక గేమ్ ఛేంజర్ అనే చెప్పాలి.

This post was last modified on February 5, 2026 3:25 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

3 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

4 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

4 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

5 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

6 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

6 hours ago