Trends

ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ హైస్ట్ @ 400 కోట్లు!

అడవుల మధ్యలో నుంచి పాములాగా మెలికలు తిరిగిన రోడ్డు మీదుగా వందల కోట్ల రూపాయల లోడ్ తో వెళుతున్న 2 కంటైనర్లు.
హఠాత్తుగా ఆ కంటైనర్లను కొందరు దుండగులు దారి మళ్లిస్తారు.
ఆ కంటైనర్లు మాయమౌతాయి.

పోలీసులు, పొలిటిషియన్లు రంగంలోకి దిగి నెలలు గడిచినా కంటైనర్ల జాడ లేదు.
ఇదంతా చదువుతుంటే ఏదో డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ?
కానీ ఇది రీల్ కథో, రీల్స్ కోసం చేసిన వీడియోనో కాదు. నిజంగా జరిగిన కథ.

అక్టోబర్ 22న గోవా నుంచి కర్ణాటక మీదుగా మహారాష్ట్రకు 2 భారీ కంటైనర్లు ప్రయాణిస్తున్నాయి.
ఆ రెండు కంటైనర్లలో దాదాపు 400 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు ఉన్నాయి.

గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మీదుగా వెళుతున్న ఆ రెండు కంటైనర్లు ఆ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన బోర్లా ఘాట్ దగ్గర దారి దోపిడీకి గురయ్యాయి.

ఆ కంటైనర్లు దోపిడీకి గురయ్యాయని, తాను తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని ఆ కంటైనర్లలో ఒకదాని డ్రైవర్ డిసెంబరు 17న కంప్లయింట్ ఇవ్వడంతో మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

వందల కోట్ల డబ్బు వ్యవహారం కావడంతో సిట్ ను కూడా ఏర్పాటు చేశారు.
గోవా పోలీసుల సహకారంతో ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్న సిట్ అధికారులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఇక కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికల్లో పంచేందుకు ఆ డబ్బును కాంగ్రెస్ తరలిస్తోందని బీజేపీ ఆరోపిస్తే
కాదు, ఆ డబ్బు బీజేపీదేనని కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది.

ఈ దోపిడీకి పొలిటికల్ గ్లామర్ కూడా అద్దబడింది.
దేశంలో ఇప్పటివరకు జరిగిన దారి దోపిడీల్లో ఇదే అతిపెద్దది అని చెబుతున్నారు.

దోపిడీ జరిగిన మూడు నెలల తర్వాత అంటే డిసెంబరు 17న సందీప్ దత్త అనే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం నిజంగా విడ్డూరంగా మారింది.
విరాట్ గాంధీ ఆదేశాలతో విశాల్ నాయుడు మరికొందరు తనను కిడ్నాప్ చేశారని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాడు.

టెక్నికల్ గా దోపిడీ జరిగింది కర్ణాటకలో కావడంతో జనవరి 6న నాసిక్ ఎస్పీ, బెళగావి ఎస్పీకి లేఖ రాశారు.
అప్పుడే ఈ దోపిడీ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం మహారాష్ట్ర, గోవా, కర్ణాటక పోలీసులు కలిసి ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అయితే అసలు అంత డబ్బు ఎవరిది?
ఎక్కడికి వెళుతోంది?
అది బ్లాక్ మనీనా లేక లెక్కా పత్రాలు ఉన్న డబ్బేనా?

ఈ విషయాలపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో ఆ డబ్బు ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారి కిషోర్ శెట్టికి చెందినదని
గోవాకు చెందిన బాలాజీ ట్రస్ట్ అనే ధార్మిక సంస్థదని
రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇక ఆ కంటైనర్లలో 2000 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయన్న ప్రచారం మరో పుకారుకు దారి తీసింది.
అంతేకాదు ఆ కంటైనర్ల అసలు డెస్టినేషన్ తిరుపతి అన్న మాట రావడం ఈ కథలో అసలు ట్విస్ట్ గా మారింది.

ఇంతకీ ఆ డబ్బెవరిది? అని మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నిస్తే
ఆ ఒక్కటీ అడక్కు అంటున్నారట!

This post was last modified on January 28, 2026 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకే నేపథ్యంతో చిరంజీవి బాలకృష్ణ ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడిన సందర్భాలు బోలెడున్నాయి కానీ ఒకే బ్యాక్…

34 minutes ago

సీఎం కల నెరవేరకుండానే…

మహారాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత అజిత్ పవార్.. ఈ రోజు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేట్ జెట్…

37 minutes ago

ధనుష్ కి బాడీ గార్డులుగా మారిన కొడుకులు

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ ఇప్ప‌టికీ చూడ్డానికి కుర్రాడిలాగే ఉంటాడు. చ‌క్క‌గా ప్రేమ‌క‌థ‌లూ చేసుకుంటున్నాడు. కానీ అత‌డికి టీనేజీలో ఉన్న…

45 minutes ago

పవన్ స్పూర్తితో నిజమైన యాంకర్ కల

యాంకర్ స్రవంతి చొక్కారపు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో షోలు, ఇంటర్వ్యూలతో అలరించిన ఆమె ఇప్పుడు…

2 hours ago

ఆ వీడియో రచ్చపై స్పందించిన జగన్

జనసేన నేత, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రభుత్వ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసిన వైనం హాట్…

3 hours ago

ఆ హీరోతో ఫ్లాప్ పడితే ఇక అంతే

​కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కెరీర్ గ్రాఫ్ గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సక్సెస్…

4 hours ago