గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ శ్రీ వరించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(మరణానంతరం) పద్మ విభూషణ్, మలయాళ లెజెండరీ నటుడు మమ్మూట్టికి పద్మ భూషణ్ దక్కాయి.
తెలుగు రాష్ట్రాలకు నుంచి 11 మందికి పద్మ అవార్డులు. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ దక్కింది. తెలంగాణకు చెందిన విజయ్ ఆనంద్‌రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికారెడ్డిలను పద్మశ్రీ వరించింది.
డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, గూడూరు వెంకట్రావులకు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ లకు పద్మశ్రీ దక్కింది. కళా విభాగంలో మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ. సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates