రెండు నెల కిందట భారత అగ్రశ్రేణి మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి అర్ధంతరంగా ఆగిపోవడంపై ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. స్మృతి తండ్రి అనారోగ్యం పాలవడం వల్లే ఈ పెళ్లికి బ్రేక్ పడినట్లు ముందుగా వార్తలు వచ్చాయి. కానీ రోజులు గడిచేకొద్దీ ఈ వ్యవహారం అనేక సందేహాలకు తావిచ్చింది. పెళ్లి వాయిదా పడడం కాకుండా మొత్తంగా ఆగిపోవడంతో అందుకు దారి తీసిన కారణాలేంటనే చర్చ విస్తృతంగా జరిగింది.
పలాష్ ముచ్చల్ గతంలో ఒకమ్మాయితో అతను ఎంగేజ్మెంట్ వరకు వెళ్లడం.. స్మృతితో రిలేషన్‌షిప్‌లో ఉండగానే ఒక అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తూ మెసేజ్‌లు పెట్టడం.. దీనికి సంబంధించిన ఫొటోలు, స్క్రీన్ షాట్లు వైరల్ కావడం సంచలనం రేపగా.. మరోవైపు పెళ్లి ఆగిపోవడానికి ఇవేవీ కారణాలు కావంటూ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్మృతితో పెళ్లికి ముందు రోజు రాత్రి పలాష్ వేరే అమ్మాయితో దొరికిపోయాడన్నది ఆ స్టోరీ సారాంశం.
ఇప్పుడు ఆ విషయాన్నే స్మృతి, పలాష్‌ల కామన్ ఫ్రెండ్ ఒకరు ధ్రువీకరించారు. అతడి పేరు.. విజ్ఞాన్ మానే. అతను ప్రముఖ మీడియా సంస్థ హిందుస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మృతి, పలాష్ పెళ్లి ఆగిపోవడానికి దారి తీసిన కారణాల గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.
ముందు రోజు రాత్రి పలాష్.. ఒక అమ్మాయితో శృంగారం జరుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడని అతను వెల్లడించాడు. ఇది చూసి స్మృతి సహచర మహిళా క్రికెటర్లు అతడిని బాగా కొట్టినట్లు అతను తెలిపాడు. పెళ్లి ఆగిపోవడానికి ఇదే కారణమని అతనన్నాడు.
పలాష్ మోసగాడని.. అమ్మాయిల వ్యవహారాలతో పాటు డబ్బు తీసుకుని మోసం చేసే అలవాటు కూడా అతడికి ఉందని అతను ఆరోపించాడు. పలాష్ ఒక సినిమా కోసం తన దగ్గర రూ.40 లక్షలు డబ్బులు తీసుకున్నాడని.. దాని గురించి తర్వాత అడిగితే సినిమా బడ్జెట్ పెరగడం వల్ల ఇంకో రూ.10 లక్షలు ఇస్తే పూర్తవుతుందని చెప్పారని.. చివరికి కొన్ని రోజులకు తనను అతడి కుటుంబమంతా బ్లాక్ చేసి అవాయిడ్ చేసిందని అతను పేర్కొన్నాడు.
తన వ్యక్తిగత గొడవ సంగతేమో కానీ.. స్మృతితో పెళ్లికి ముందు రోజు రాత్రి పలాష్ వేరే అమ్మాయితో దొరికిపోయాడని, అతణ్ని మహిళా క్రికెటర్లు కొట్టారనే సమాచారం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్మృతి పెళ్లికి వెళ్లి సందడి చేసిన మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, రాధ యాదవ్, అరుంధతి రెడ్డి. మరి మానే మటల్ని బట్టి చూస్తే వీళ్లే పలాష్‌ను కొట్టారన్నమాట. అసలు పలాష్ మరో అమ్మాయితో ఉండగా చూసింది శ్రేయాంక అని వార్తలు వచ్చాయి. తర్వాత స్మృతి సోదరుడు.. పలాష్ మీద ఎటాక్ చేశాడని.. ఈ గొడవ, పెళ్లి ఆగిపోయిన నేపథ్యంలో స్మృతి తండ్రి అనారోగ్యం పాలయ్యాడని అప్పుడు ప్రచారం జరిగింది.
This post was last modified on January 25, 2026 8:11 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…