Movie News

సరిపోయే దర్శకుడితో రవితేజ కాంబో ?

ఇటీవలే విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ పూర్తిగా కంబ్యాక్ అయ్యారా అంటే ఔననే సమాధానం సగమే వస్తుంది. ఎందుకంటే సంక్రాంతి హిట్టయిన వాటిలో రాజా సాబ్ చివరి స్థానం అయితే దానికి ముందు ప్లేస్ మాస్ మహారాజాదే.

పండగ సీజన్ వల్ల అడ్వాంటేజ్ దక్కించుకుని కమర్షియల్ గా డబ్బులు చూపించినా అన్ని వర్గాలను మెప్పించే కంటెంట్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్లే నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజు తర్వాత స్థానం దక్కింది. మన శంకరవరప్రసాద్ గారు యునానిమస్ కాబట్టి దాన్ని ఈ లిస్టులో కలపడం లేదు. సో రవితేజ రియల్ స్టామినా పూర్తిగా బయట పడలేదన్నది నిజం.

దీని తర్వాత రవితేజ దర్శకుడు శివ నిర్వాణతో చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇరుముడి టైటిల్ దాదాపు ఫిక్స్ అయినట్టే. ఫాదర్ సెంటిమెంట్, పాప ఎమోషన్స్ తో పాటు బలమైన యాక్షన్ రివెంజ్ డ్రామా ఇందులో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. తన రెగ్యులర్ లవ్ జానర్ వదిలి పెట్టి శివ నిర్వాణ కొత్తగా ట్రై చేస్తున్నట్టు చెబుతున్నారు.

రవితేజ దీని తర్వాత వివేక్ ఆత్రేయకు పచ్చ జెండా ఊపినట్టు వినికిడి. సరిపోదా శనివారం అంత పెద్ద హిట్టయ్యాక కూడా వివేక్ ఆత్రేయ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఒక కోలీవుడ్ స్టార్ హీరోని ట్రై చేసి తిరిగి టాలీవుడ్ కే వచ్చినట్టు టాక్ ఉంది.

ఒకవేళ నిజమైతే మటుకు రవితేజ  ఫాన్స్ హ్యాపీగా ఫీలవుతారు. ఎందుకంటే వివేక్ ఆత్రేయ డిఫరెంట్ గా ఆలోచించే స్టోరీ రైటర్. టేకింగ్ , మేకింగ్ రెండింటిలోనూ వైవిధ్యం ఉంటుంది. అంటే సుందరానికి ఫ్లాప్ అయినా సరే దానికో కల్ట్ ఫాలోయింగ్ వచ్చేలా చేసుకోవడం ఆయనకే చెల్లింది.

సో రవితేజ కాంబోని సమ్ థింగ్ స్పెషల్ తరహాలో ఆశించవచ్చు. ప్రస్థుతానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఖరారుగా చెప్పలేం కానీ కాంబో కావాలని అభిమానులు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. గత ఫ్లాపులతో పోల్చుకుంటే భర్త మహాశయులకు విజ్ఞప్తికి చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రావడం పట్ల వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు.

This post was last modified on January 25, 2026 9:01 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

4 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

5 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

6 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

6 hours ago