Trends

మరోసారి భారత్ ఊచకోత

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అదరగొట్టింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా, భారత్ మరో 28 బంతులు మిగిలి ఉండగానే కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి కివీస్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు నాన్ స్టాప్ గా చెలరేగిపోయారు.

అభిషేక్ శర్మ డకౌట్ అయినా, సంజూ శామ్సన్ (6) త్వరగా నిష్క్రమించినా భారత్ ఎక్కడా తడబడకుండా లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఇషాన్ కిషన్ కేవలం 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు.

అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో శివం దూబే 18 బంతుల్లో 36 పరుగులు చేసి మ్యాచ్‌ను వేగంగా ముగించాడు. 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంలో కొంత తడబడ్డారు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్), రచిన్ రవీంద్ర (44) రాణించడంతో ఆ జట్టు 208 పరుగులు చేయగలిగింది.

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి (1/35), కుల్దీప్ యాదవ్ (2/35), హార్దిక్ పాండ్యా (1/25), హర్షిత్ రాణా (1/35) శివం దూబే (1/7) వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ వికెట్ తీయలేకపోయినా, ఇతర బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

కివీస్ బౌలింగ్ విభాగంలో జాకబ్ డఫీ (1/38), మ్యాట్ హెన్రీ (1/41), ఇష్ సోధి (1/34) తలా ఒక వికెట్ తీసినప్పటికీ భారత బ్యాటర్ల విధ్వంసాన్ని ఆపలేకపోయారు. ముఖ్యంగా జకారి ఫౌల్కెస్ తన 3 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టి20లోనూ రాణించిన డఫీ, ఈ మ్యాచ్‌లో కూడా పర్వాలేదనిపించినా ఇతర బౌలర్ల నుంచి సహకారం అందకపోవడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. మొత్తానికి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఇప్పుడు 2-0 ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న టీమిండియా బౌలింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

This post was last modified on January 23, 2026 10:49 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బోర్డర్ పరువును సీక్వెల్ నిలబెట్టిందా

1997లో విడుదలైన బోర్డర్ ప్రభంజనాన్ని అప్పట్లో చూసినవాళ్లు అంత సులభంగా మర్చిపోలేరు. పాకిస్థాన్ తో యుద్ధ నేపధ్యాన్ని దర్శకడు జెపి…

12 minutes ago

టాలీవుడ్‌పై కోలీవుడ్ కన్ను

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. వందల కోట్ల వసూళ్లు, మాస్ ఆడియన్స్ పల్స్…

17 minutes ago

ప్ర‌భాస్ ఫ్యాన్స్ బూతులు… ప్రొడ్యూసర్ ఫిర్యాదు

రాజాసాబ్ సినిమా మీద ప్ర‌భాస్ అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు, అంచ‌నాలు నిల‌బ‌డ‌లేదు. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన…

1 hour ago

ఉస్తాద్ ముందుకు రావడం మంచిదే

సంక్రాతి సినిమాల సందడి ఒకవైపు కొనసాగుతుండగానే ఇంకోవైపు భవిష్యత్తులో విడుదల కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్, వాటి రిలీజ్ డేట్ల…

2 hours ago

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్… సిట్ ను ప్రశ్నించిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ…

2 hours ago

అనిల్ రావిపూడి చెప్పిన స్టార్ మంత్రం

మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోకుండా అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అతి సామాన్యమైన పాత్రలు…

2 hours ago