జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతైన లోయలో పడిపోవడంతో 10 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన భదర్వా ప్రాంతంలోని ఖన్నీ టాప్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
సైనిక వాహనం ఎత్తైన ప్రాంతంలోని పోస్ట్ వైపు వెళ్తుండగా, భదర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ స్థానిక పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. మొదట నలుగురు చనిపోయారని భావించినా, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మృతుల సంఖ్య 10కి పెరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని ప్రత్యేక చికిత్స కోసం ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా తరలించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు.
జవాన్ల నిరుపమాన సేవలను, వారి త్యాగాలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కమాండ్ హాస్పిటల్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచు కురుస్తున్న ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతోంది. ప్రాణాలతో బయటపడిన జవాన్ల కోసం వైద్య బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
This post was last modified on January 22, 2026 5:19 pm
విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం (AK47)' ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో…
సోషల్ మీడియా…రెండు వైపులా పదునున్న కత్తి. పిల్లల నుంచి పెద్దల వరకు టెక్ యుగంలో ఏదో ఒక సోషల్ మీడియా…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్…
వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి చేయబోతున్న మెగా 158 కోసం దర్శకుడు బాబీ క్యాస్టింగ్ ఫైనల్ చేసే…
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి మేఘాల్లో తేలిపోతున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ కో బ్లాక్ బస్టర్ ఇచ్చి…
సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70…