వ్యూస్ వస్తే డబ్బులొస్తాయి. ఆ పైసల కోసం చేసే పాడు పనులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చెప్పే ఒక దుర్మార్గుడు కూడా ఇలాంటి పనులే చేస్తుంటాడు. వాడి మీద తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు. వీడి దారుణ చేష్టల గురించి తెలిస్తే.. ఇలాంటోడి మీద పోక్సో కేసు కూడా తక్కువే అన్న భావన కలుగక మానదు. ఇంతకూ వీడి దారుణాల్లోకి వెళితే..
విశాఖపట్నానికి చెందిన 39 ఏళ్ల సత్యమూర్తికి ఒక పాడు బుద్ధి ఉంది. వైరల్ హబ్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఇతగాడు.. 2018 నుంచి యూట్యూబ్ చానల్ ను నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యన ఇద్దరు చిన్నారుల్ని ఇంటర్వ్యూ పేరుతో గలీజు ప్రశ్నలు వేయటమే కాదు.. వాటి నుంచి సమాధానాలు రాబట్టి పైశాచిక ఆనందాన్ని పొందాడు. అంతేనా.. అక్కడితో అగని ఈ దుర్మార్గుడు.. చిన్నారులు ముద్దులు పెట్టుకునేలా చేశాడు.
ఆ పాడు వీడియోలను యూట్యూబ్.. ఇన్ స్టాలో పోస్టు చేశాడు. చూసినంతనే చిరాగ్గా.. పిల్లలతో ఈ పాడు పనులేంట్రా అన్న కోపాన్ని కలిగించే ఈ వీడియోలు వైరల్ గా మారాయి. వీటిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. పలువురు ఈ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు అందాయి. దీంతో స్పందించిన హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపట్టి.. అతి జుగుప్సాకరంగా ఉన్న ఈ వీడియోలపై చర్యలు చేపట్టారు.
పోక్సో.. ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేయటమే కాదు.. తాజాగా అతగాడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ దుర్మార్గ చానల్ అందుబాటులోనే ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి కంటెంట్ చేసే వారిపై చర్యలు కఠినంగా ఉండటమేకాదు.. ఇలాంటి పాడు ఆలోచనలు చేస్తే.. కఠిన శిక్షలు తప్పవన్న సందేశం త్వరగా అందరికి చేరాల్సిన అవసరం ఉంది. అందుకోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on January 8, 2026 2:16 pm
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్‌డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్‌డేట్…