కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలికను ఆమె తల్లిదండ్రులే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
ఆర్చన అనే 16 ఏళ్ల బాలిక నవంబర్ 16న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మొదట ఆమె తండ్రి రెడ్డి రాజు, తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులకు అనుమానం రావడంతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, హత్య అని తేలింది.
పోలీసుల వివరాల ప్రకారం, ఆర్చన అదే గ్రామానికి చెందిన అనిల్ అనే పెళ్లయిన వ్యక్తితో ప్రేమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పలుమార్లు ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె ఆ సంబంధాన్ని విడిచిపెట్టకపోవడంతో, కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే భావనతో తల్లిదండ్రులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నవంబర్ 15 రాత్రి ఆర్చన నిద్రపోయిన తర్వాత ఆమెకు బలవంతంగా విషం తాగించారని, ఇంకా ప్రాణాలతో ఉన్న సమయంలో తండ్రి గొంతు నులిమి చంపినట్లు విచారణలో బయటపడింది. పోలీసుల విచారణలో తండ్రి రెడ్డి రాజు నేరాన్ని ఒప్పుకున్నాడు.
ఈ ఘటన నేపథ్యంలో సైదాపూర్ పోలీసులు తల్లిదండ్రులు రెడ్డి రాజు, లావణ్యలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు వారిని కస్టడీకి పంపింది.
ఇదిలా ఉండగా, ఆర్చన అక్క శ్రావణి మరో ఫిర్యాదు చేస్తూ, అనిల్‌తో ఉన్న సంబంధమే తన చెల్లి మృతికి కారణమని పేర్కొంది. ఈ ఫిర్యాదు ఆధారంగా అనిల్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో కుటుంబ గౌరవం పేరుతో జరిగే హింస ఎంత దారుణమైనదో మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on December 27, 2025 6:18 pm
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల…
ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కోట్లు సంపాదించినా, లక్షల అభిమానులను వెనక నిలుపుకున్నా దానికి ప్రధాన కారణం ప్రేక్షకులే.…
ఇటీవలే విడుదలైన ఛాంపియన్ ద్వారా మలయాళ కుట్టి అనస్వర రాజన్ పరిచయమయ్యింది. రామ్ చరణ్ అంతటి స్టారే ప్రీ రిలీజ్…
ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లు కొల్లగొట్టి దూసుకుపోతూనే ఉన్న దురంధర్ కొందరి జీవితాలను సమూలంగా మార్చేసింది. వాళ్లలో…
మూడేళ్లకు పైగా సమయాన్ని కేవలం ఒక్క సినిమా కోసమే వెచ్చించిన రోషన్ మేకకు ఛాంపియన్ రూపంలో ఫలితం వచ్చేసింది. యునానిమస్…
మాములుగా స్టార్ హీరోలు తమ వయసు ఎంత ఉన్నా చిన్న ఈడు హీరోయిన్లతో రొమాంటిక్ ట్రాక్స్, డ్యూయెట్స్ కోరుకోవడం సహజం.…