థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న ఒక విష్ణు విగ్రహాన్ని థాయ్ మిలిటరీ జేసీబీలతో కూల్చివేసిన వీడియోలు బయటకొచ్చాయి. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పందించింది. ఇది మతపరమైన దాడి కాదని, కేవలం భద్రతా చర్యల్లో భాగంగానే చేశామని క్లారిటీ ఇచ్చింది.
ఆ విగ్రహం 2014లో కట్టారని, దానికి అధికారికంగా ఎలాంటి మతపరమైన గుర్తింపు లేదని థాయ్ అధికారులు చెబుతున్నారు. ఆ భూమి తమదే అని చెప్పుకోవడానికి కంబోడియా సైనికులు ఆ విగ్రహాన్ని అక్కడ ఒక ‘ల్యాండ్ మార్క్’ లాగా పెట్టారని థాయ్‌లాండ్ వాదన. ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాక, సరిహద్దు భద్రత కోసమే దాన్ని తొలగించామన్నారు.
హిందూమతంతో సహా అన్ని మతాలను తాము సమానంగా గౌరవిస్తామని థాయ్‌లాండ్ స్పష్టం చేసింది. అయితే ఈ చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని భారత్ ఆవేదన వ్యక్తం చేసింది. రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.
మరోవైపు కంబోడియా మాత్రం ఇది తమ భూభాగంలో జరిగిన దాడి అని ఆరోపిస్తోంది. సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో ఉన్న తమ ప్రదేశంలోకి వచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మండిపడుతోంది. సరిహద్దు గొడవల వల్ల ఇప్పటికే అక్కడ పరిస్థితులు సీరియస్ గా ఉన్నాయి, ఈ తాజా ఘటనతో వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
This post was last modified on December 25, 2025 8:22 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యుత్తమ డ్యాన్సర్ల లిస్టు తీస్తే.. అగ్ర స్థానానికి గట్టి పోటీదారుగా ఉంటాడు హృతిక్ రోషన్. తన…
సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. అతను ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాలే తీశాడు.…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై…
రంగం ఏదైనా.. వ్యాపారం మరేదైనా గుత్తాధిపత్యం అస్సలు మంచిది కాదు. పోటీ తత్వం లేకుంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించే తీరు అంతకంతకూ…
తెలంగాణ రాజకీయాల్లో మరింత సెగ పెరుగుతోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జంపింగ్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటేనే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు.. గీతా జయంతినాడు ఆయన…