ప్రముఖ ఫార్మాసంస్ధ ఫైజర్ కరోనా వైరస్ యాంటీ వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలసిందే. తాము డెవలప్ చేసిన టీకాను ఎలర్జీలున్న వాళ్ళు వేయించుకోవద్దంటూ స్పష్టంగా యాజమాన్యం ప్రకటించేసింది. ఆహారంతో పాటు మందులు, ఇతరత్రా ఎలర్జీలున్న వాళ్ళు తాము తయారు చేసిన కోవిడ్ టీకాను వేయించుకోవద్దంటూ బహిరంగంగానే హెచ్చరించింది. ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే వేలాదిమంది ఫైజర్ తయారుచేసిన కరోనా టీకాను వేయించుకుంటున్న విషయం తెలిసిందే.
ఫైజర్ రెడీ చేసిన టీకాను వేయించుకున్న వేలాదిమందిలో ఉన్నట్లుంది రీయాక్షన్ వచ్చింది. దాంతో కంపెనీ కంగారుపడి వాళ్ళిద్దరినీ వెంటనే ఆసుపత్రిలో చేర్చింది. ఆసుపత్రిలో చేరిన వాళ్ళిద్దరిని పరిశీలించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే టీకా వేసుకునేటప్పటికి వాళ్ళిద్దరికీ రకరకాల ఎలర్జీలున్నాయట. అందుకనే కరోనా టీకా వేసుకోగానే వాళ్ళలో రియాక్షన్ వచ్చిందని అర్ధమైంది. అంటే టీకాలో వాడిన అనేక రకాల ఔషధాలకు సంబంధించి రియాక్షన్ వచ్చేది ఏదో ఉందన్న విషయం అర్ధమైంది.
ఇటువంటి కారణాలతోనే కంపెనీ యాజమాన్యం ముందుజాగ్రత్తగా ఎలర్జీలున్న వాళ్ళు టీకాలు వేయించుకోవద్దంటూ బహిరంగంగా హెచ్చరించింది.
ఫైజర్ డెవలప్ చేసిన టీకా తొలిదశలో 80 ఏళ్ళ వృద్ధులు, వైద్య సబ్బంది, వాలంటీర్లు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తోంది. టీకా తీసుకున్న వారిలో ఇద్దరి ఒళ్ళంతా ర్యాష్ అంటే దద్దుర్లు వచ్చేయటం, ఊపిరి ఆడకపోవటం, రక్తపోటు తగ్గిపోవటాన్ని డాక్టర్లు గుర్తించారు. కొత్త రకమైన మందులు తయారు చేసినపుడు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మామూలే అయినా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని ఫైజన్ నిర్ణయించింది.
టీకాలు వేయించుకునే వాళ్ళు తమకు ఇదివరకే ఉన్న అనారోగ్య సమస్యలు, ఎలర్జీలను చెబితే దానికి తగ్గట్లే ముందస్తు ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. ఎలర్జీలు వచ్చిన ఇద్దరి పరిస్దితి ప్రస్తుతానికి బాగానే ఉందని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఫైజర్ టీకా ట్రయల్స్ లో బ్రిటన్లోని 19 వేల మందిలో 137 మందికి సైడ్ ఎఫెక్ట్ కనిపించింది. అలాగే అమెరికాలో 21720 మందికి ట్రయల్ టీకా వేస్తే నలుగురిపై దుష్ఫలితాలు కనిపించాయి.
This post was last modified on December 10, 2020 2:54 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…