Trends

ప్రపంచ కుబేరునికి ఊహించని దెబ్బ?

అప‌ర కుబేరుడు.. బ‌హుళ వ్యాపారాల దిగ్గ‌జ పారిశ్రామిక వేత్త‌.. ఎలాన్ మ‌స్క్‌కు భారీ ఎదురు దెబ్బ త‌గ‌లనుంద‌ని అంత‌ర్జాతీయ మీడియా పేర్కొంది. మ‌స్క్‌కు చెందిన `స్టార్ లింక్‌` ప్రాజెక్టులో కీల‌క ఉప గ్ర‌హం.. ఒక‌టి ఒక్కసారిగా కుప్ప‌కూలింద‌ని.. ఇది మ‌రో నాలుగైదు రోజుల్లో భూమిపై ప‌డుతుంద‌ని పేర్కొంది. దీనికి గాను మ‌స్క్ కొన్నివేల కోట్ల రూపాయ‌ల‌ను పెట్టుబ‌డిగా పెట్టార‌ని.. ఆసొమ్మంతా వృథా కావ‌డంతోపాటు స్టేక్ హోల్డ‌ర్ల‌పైనా ఈ ప్ర‌భావం ప‌డ‌నుంద‌ని.. అంత‌ర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. `స్టార్ లింక్‌` అనేది మ‌స్క్ ప్రారంభించిన అంత‌ర్జాతీయ ప్రాజెక్టు.

దీని ద్వారా.. ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి పంపించి.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గూగుల్‌కు పోటీ ఇవ్వ‌గ‌ల ఇంట‌ర్నెట్ వ్య‌వ‌స్థ‌ను ఆవిష్క‌రించాల‌ని ఆయ‌న భావించారు. దీనికి సంబంధించి ఇటీవ‌లే భార‌త్‌తోనూ ఒప్పందాలు చేసుకున్నారు. ఇంట‌ర్నెట్ స‌హా.. ఇత‌ర ఐటీ సేవ‌ల‌ను కూడా త‌న అంత‌రిక్ష కేంద్రం ద్వారా.. ఇవ్వాల‌న్న‌ది ప్లాన్‌. ఈ క్ర‌మంలోనే ప‌లు ఉప గ్ర‌హాల‌ను ఆయ‌న ప్ర‌యోగించారు. దీనిలో ఒక‌టి `శాటిలైట్ 35956`. అయితే.. ఇది ఒక్క‌సారిగా కుప్ప‌కూల‌డం ప్రారంభించింది. ఈ నెల 17న మొద‌లైన ఈ స‌మ‌స్య‌.. మ‌రో నాలుగు రోజుల్లో భూమిపైకి ప‌డిపోనుంద‌ని స్టార్ లింక్ సంస్థ కూడా వెల్ల‌డించింది.

ఏంటి కార‌ణం?
శాటిలైట్ల‌ను మ‌స్క్ సంస్థ‌ `స్పేస్ ఎక్స్‌`నియంత్రిస్తుంది. అయితే.. `శాటిలైట్ 35956`పై స్పేస్ ఎక్స్ నియంత్ర‌ణ‌ను కోల్పోయింది. కీల‌క‌మైన ప్రొపెల్ష‌న్ ట్యాంకులో  గ్యాస్ లీక్ కావ‌డంతోనే ఇది జ‌రిగిన‌ట్టుగా స్టార్ లింక్ ప్రాజెక్టు నిర్వాహ‌కులు తెలిపారు. దీంతో ఈ నెల 17 నుంచి కూలిపోవ‌డం ప్రారంభించిన‌ట్టు చెప్పారు.

ప్ర‌స్తుతం భూమికి 418 కిలో మీట‌ర్ల ఎత్తులో ఉంద‌ని.. మ‌రో నాలుగైదు రోజుల్లో భూమిపై ఎక్క‌డైనా ప‌డిపోయే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. కాగా.. శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలాస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా.. వెంటోర్‌టెక్‌ సంస్థకు చెందిన వరల్డ్‌వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి హైరిజల్యూషన్‌ చిత్రాలను తీసింది.

This post was last modified on December 21, 2025 10:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Elon Musk

Recent Posts

రాష్ట్ర‌ప‌తితో మ‌న మీమ్స్ గాడ్

నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సుదీర్ఘ కెరీర్. అందులో మూడు ద‌శాబ్దాల పాటు తెలుగులో నంబ‌ర్ వ‌న్ క‌మెడియ‌న్‌గా తిరుగులేని ఆధిప‌త్యం.…

1 hour ago

‘ఇవాల్టి వ‌ర‌కు ఒక క‌థ‌.. రేప‌టి నుంచి మ‌రోక‌థ‌’

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు వ‌ర‌కు ఒక క‌థ‌.. రేప‌టి…

5 hours ago

కూలీ మిస్ చేసింది దురంధర్ చూపించింది

కూలీలో నాగార్జున విలన్ గా నటిస్తారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చాలా వయొలెంట్ గా…

7 hours ago

జగన్ నోట ‘షర్మిలమ్మ’ మాట

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల మ‌ధ్య దాదాపు అంద‌రికీ తెలిసి.. మూడున్న‌రేళ్ల‌కుపైగానే…

8 hours ago

చంద్ర‌బాబుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నిజమెంత?

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు మాట‌లు విని.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం త‌మ‌కు అన్యాయం…

9 hours ago