Trends

రీల్స్ మ‌హిమ‌… న‌వ్వుల నుండి మెరుపుల వ‌ర‌కు

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఏ రోజు ఎవ‌రు పాపుల‌ర్ అవుతారో.. ఏ వీడియో వైర‌ల్ అవుతుందో చెప్ప‌లేం. కేవ‌లం రీల్స్, షార్ట్స్ ద్వారా పాపుల‌ర్ అయి టీవీ షోలు, సినిమాల్లో అవకాశాలు అందుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. దుర్గారావు అనే వ్య‌క్తి భార్య‌తో క‌లిసి చేస్తున్న వీడియోలు పాపుల‌ర్ అయి.. ప‌లాస అనే సినిమాకు ప్ర‌మోష‌న్ ప‌రంగా ఉప‌యోగ‌ప‌డ‌డం.. ఆ త‌ర్వాత అత‌ను త‌న భార్య‌తో క‌లిసి టీవీ షోల్లోనూ పాల్గొన‌డం.. సోష‌ల్ మీడియాలో మ‌రింత ఫాలోయింగ్ సంపాదించ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల అలా అనుకోకుండా బాగా పాపుల‌ర్ అయింది ఒక మిడిల్ క్లాస్ జంట‌. ఆర్బీహెచ్ వ్లాగ‌ర్స్ పేరుతో వీడియోలు చేసే భార్యాభ‌ర్త‌లు రాజ‌శేఖ‌ర్ సినిమా ఆయుధంలో పాపుల‌ర్ అయిన ఇదేమిట‌మ్మా మాయా మాయా పాట‌కు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమా కేర్యాంప్‌లో ఈ పాటను వాడుకోగా.. రీల్స్ కోసం ల‌క్ష‌ల మంది ఆ పాట‌ను ఉప‌యోగించుకున్నారు.

ఆర్బీహెచ్ వ్లాగ‌ర్స్ జంట కూడా ఆ పాట‌కు డ్యాన్స్ చేసింది. ముందు భార్య స్టెప్ వేస్తుంటే.. వెనుక భ‌ర్త వేసి డ్యాన్స్ న‌వ్వులు పూయించింది. ఈ వీడియో సోష‌ల్ మ‌డియాలో ఎక్క‌డెక్క‌డికో వెళ్లిపోయింది. కొంద‌రు ఫారినర్స్ సైతం ఈ వీడియోను రీక్రియేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు.
ఇలా పాపుల‌ర్ అయిన ఆ జంట‌ను.. ఇప్పుడు ప‌ద్మ‌మోహ‌న్ టీవీ అవార్డుల కార్య‌క్ర‌మంలో పెర్ఫామ్ చేయ‌డం విశేషం.

సుమ‌న్ స‌హా ప‌లువురు సినీ, టీవీ సెల‌బ్రెటీలు.. రాజ‌కీయ నాయ‌కులు పాల్గొన్న వేడుక‌లో ఈ ఇద్ద‌రూ స్టేజ్ మీద డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇలాంటి కార్య‌క్ర‌మంలో ఈ డ్యాన్సులేంటి అనే కామెంట్లు కూడా వినిపించిన‌ప్ప‌టికీ.. జ‌స్ట్ ఒక రీల్ ద్వారా వ‌చ్చిన పాపులారిటీతో ఈ జంట ఇక్క‌డిదాకా రావ‌డం అనూహ్యం. అందులో డ్యాన్స్ చూసిన న‌వ్విన వాళ్లే.. ఇప్పుడు ఆ జంట‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని చూసి అవాక్క‌వుతున్నారు.

This post was last modified on December 21, 2025 9:49 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

30 ఏళ్ల తర్వాత మణిరత్నం, కొయిరాలా కలిసి…

బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో…

36 minutes ago

లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరదేమో

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’…

2 hours ago

టీమ్ లో గిల్ లేకపోవడం మంచిదే

నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్‌మన్…

2 hours ago

వీసా రెన్యూవల్… మనోళ్లకు మరో బిగ్ షాక్!

అమెరికాలో ఉద్యోగం చేస్తూ, వీసా రెన్యూవల్ కోసం ఇండియా వచ్చిన వారికి పెద్ద షాక్ తగిలింది. డిసెంబర్ 15 తర్వాత…

4 hours ago

చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర…

5 hours ago

రెడ్ల‌ను వ‌దిలేసి జ‌గ‌న్ రాజ‌కీయం.. ఫ‌లించేనా..!

రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకుని జగన్ గత ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారంలోకి వస్తామని పదేపదే చెప్పినప్పటికీ,…

5 hours ago