2020కు మించి 2021? నోస్ట్రడామస్ అంచనాలు ఇవేనట

భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్నంతనే తెలుగువారికి పోతులూరు వీరబ్రహ్మం స్వామి గుర్తుకు వస్తే.. విదేశీయులకు నోస్ట్రడామస్ గుర్తుకు వస్తారు. వందల ఏళ్ల క్రితమే.. భవిష్యత్తులో ఏం జరుగుతుందన్న విషయాల్ని ముందే ఊహించటం.. అవన్నీ జరగటం లాంటివి చూసినప్పుడు.. వీరు చెప్పిన జోస్యాల్ని సింఫుల్ గా తీసుకోలేం. కరోనా కారణంగా 2020 ఎప్పుడెప్పుడో అయిపోతుందా? అని ఎదురుచూస్తున్న ప్రపంచానికి 2021 గురించి నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే షాక్ కు గురి కాక తప్పదంటున్నారు.

జ్యోతిష్యాలు.. అంచనాలు.. భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాల్ని కొందరికి అస్సలు నమ్మకం ఉండదు. కానీ.. వారు చెప్పిన అంశాల్ని చూసినప్పుడు.. నిజమే కదా? అన్న భావన కలుగక మానదు. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఫ్రెంచ్ తత్త్వవేత్త భవిష్యత్తును ఊహించారు. దాదాపు కీస్త్రశకం 3797 వరకు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయన ఊహించినట్లుగా చెబుతున్నారు.
నోస్ట్రడామస్ మొత్తం 6338 అంచనాలు వేశారు. ఆయన చెప్పినవి ఇప్పటి వరకు చాలానే జరిగాయి. తాను జీవించిన కాలానికి దాదాపు 500 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆయన ఎలా చెప్పగలిగారు. అన్నది మాత్రం ఇప్పటికి తేలలేదు. ఇప్పటివరకు ఆయన ప్రస్తావించిన అంశాల్లో 70 శాతం నిజం కావటం గమనార్హం. ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తే.. వాటి ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన అంచనా వేశారు.

బ్రిటిష్ రాణి డయానా.. జర్మనీనియంత హిట్లర్.. అణుబాంబు ప్రయోగం.. రెండో ప్రపంచ యుద్ధం.. అమెరికాలో 9/11 దాడులు అన్ని ఆయన చెప్పినట్లే జరగటం గమనార్హం. తాజాగా 2021 గురించి ఆయనేం చెప్పారు? అన్న విషయం గురించి ఆసక్తికర అంశాల్నిచెబుతున్నారు. ఈ వివరాల్ని తెలుసుకున్న తర్వాత 2021 కంటే 2020నే బెటర్ అన్న భావన కలిగినా ఆశ్చర్యపోకూడదంటున్నారు.

ఇంతకీ నోస్ట్రడామస్ ఏం చెప్పారు? 2021ల్ ఏం జరుగుతుందని జోస్యం చెప్పారన్న విషయంలోకి వెళితే.. వైరస్ లతో రష్యా బయలాజికల్ వెపన్ ను తయారు చేస్తుందన్నారు. దీని వల్ల ఉత్పత్తి అయ్యే వైరస్ ప్రపంచం మొత్తానికి ప్రమాదకరంగా మారుతుందన్నారు. భూకంపాలు.. చిత్రమైన వ్యాధులు రావటంతో పాటు.. ఏదైనా సడన్ గా జరిగిపోతుందని పేర్కొన్నారు. అంతేకాదు.. రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్ ను ముస్లింలు స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు.

భారీ సౌర తుపాన్లకు అవకాశం ఉందని.. వాతావరణ మార్పులు.. యుద్ధాలకు అవకాశం ఉందని చెప్పారు. అంతేకాదు.. ఒక తోకచుక్క సూటిగా భూమిని తాకి అపారమైన నష్టానికి గురి చేస్తుందని చెప్పాడు. ఆ సమయంలో ఆకాశం మొత్తం ఎరుపు రంగులో భారీ మంటలా కనిపిస్తుందని చెప్పారు. దీనికి తగ్గట్లే 2021లోఒక గ్రహశకలం భూమిని ఢీ కొడుతుందని నాసా కూడా అంచనా వేస్తుంది. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. హీరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే 15 రెట్లు ఎక్కువ శక్తితో ఉంటుందని.. అపార నష్టం వాటిల్లుతుందని అంచనా వేశారు.

2021లో భారీ భూకంపం ఒకటి కాలిఫోర్నియలో చోటు చేసుకుంటుందని.. దాంతో ఆ నగరం దారుణంగా దెబ్బ తింటుందని పేర్కొన్నారు. కాలిఫోర్నియా పేరును ప్రస్తావించనప్పటికీ.. కొత్త ప్రపంచం అని పేర్కొన్నారు. ప్రపంచ గమనాన్ని మార్చేసిన గూగుల్.. మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీల కేరాఫ్ అడ్రస్ కాలిఫోర్నియానే కావటం గమనార్హం. మరి.. ఆయన అంచనా వేసినట్లు జరుగుతుందా? అంటే.. మరికొంత కాలం వెయిట్ చేస్తే..వాస్తవం కళ్ల ముందుకు వచ్చేయనుంది. ఏమంటారు?