విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. కానీ జర్మనీలో తొమ్మిదేళ్లుగా ఉంటున్న మయూఖ్ పాంజా అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. తనకు జర్మన్ పాస్‌పోర్ట్ వచ్చే అర్హత ఉన్నా సరే, దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి మనసు ఒప్పుకోలేదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మయూఖ్ జర్మనీలో ఏఐ కంపెనీ ఫౌండర్. అక్కడికి వెళ్లి తొమ్మిదేళ్లు దాటింది. ఏడాది క్రితమే ఆయనకు జర్మన్ పౌరసత్వం తీసుకునే అర్హత వచ్చింది. కానీ ఆయన అప్లై చేయలేదు. దీనికి కారణం చెబుతూ సోషల్ మీడియాలో (X) ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు. “ఇది కేవలం ఒక డాక్యుమెంట్ మాత్రమే కావచ్చు. కానీ నేను భారతీయుడిని. జర్మన్‌గా మారడం నాకు ఎందుకో వింతగా అనిపిస్తోంది. నేను ఇక్కడ ఎంతకాలం ఉన్నా నా మనసు మాత్రం ఇండియన్‌గానే ఫీల్ అవుతోంది” అని రాసుకొచ్చాడు.
జర్మనీ చరిత్ర, భాష, సంస్కృతి తనకు తెలుసు కానీ వాటితో ఎమోషనల్ కనెక్షన్ లేదని చెప్పాడు. ఉదాహరణకు జర్మనీ ఫుట్‌బాల్ మ్యాచ్ గెలిస్తే తనకు పెద్దగా ఏమీ అనిపించదని, అదే ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఆ కిక్కే వేరని చెప్పుకొచ్చాడు. తాను జర్మనీకి స్నేహితుడిని మాత్రమే తప్ప, జర్మనీ వాడిని కాలేనని స్పష్టం చేశాడు.
మరో ముఖ్యమైన కారణం కూడా చెప్పాడు. జర్మనీ పౌరసత్వం తీసుకుంటే అక్కడి పద్ధతులకు తగ్గట్టుగా తాను మారాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఉన్న వారి సంస్కృతి తన కోసం మారాలని కోరుకోవడం తప్పు. అదే ఇండియాలో అయితే, మెజారిటీ అభిప్రాయంతో విభేదించినా సరే, తన గొంతు వినిపించే హక్కు తనకు ఉంటుందని ఫీల్ అయ్యాడు. “నా అభిప్రాయాలు భారతీయమైనవి. అవి అందరికీ నచ్చకపోవచ్చు. కానీ అవి కలిగి ఉండే హక్కు ఇండియన్ పాస్‌పోర్ట్ నాకు ఇస్తుంది” అని గర్వంగా చెప్పాడు.
This post was last modified on December 9, 2025 9:38 pm
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…