ముంబైలోని ఓ కార్పొరేట్ ఆఫీసులో జరిగిన ఘటన వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. పదిమంది పని చేసే ఆఫీసు, ఒక మహిళ పాలిట నరకకూపంగా మారింది. 51 ఏళ్ల మహిళా బిజినెస్ ఉమెన్‌పై ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన సీనియర్ అధికారులు చేసిన అఘాయిత్యం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఓ వివాదం విషయంలో తుపాకీతో బెదిరించి, కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించి వీడియోలు తీశారనే ఆరోపణలు పోలీసులను కూడా షాక్‌కు గురిచేస్తున్నాయి.
బాధితురాలు ఫోటో ఫ్రేమ్స్, గిఫ్టింగ్ బిజినెస్ చేస్తున్నారు. పని మీద మహాలక్ష్మి ఏరియాలోని ఆ ఫార్మా కంపెనీ ఆఫీసుకి వెళ్లారు. అక్కడే అసలు దారుణం జరిగింది. ఆఫీసులోని ఒక క్యాబిన్‌లో ఆరుగురు సీనియర్ ఆఫీసర్లు ఆమెను టార్గెట్ చేశారు. ఒక వ్యక్తి రివాల్వర్ వెనుక భాగంతో ఆమె భుజంపై, వీపుపై బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, ఆమె వేసుకున్న డ్రెస్ ని బలవంతంగా లాగేసి, తలకు తుపాకీ గురిపెట్టి చంపేస్తామని బెదిరించారని బాధితురాలు తెలిపారు.
ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళను, బట్టలు విప్పాలంటూ తుపాకీ చూపించి ఫోర్స్ చేశారట. ఆమె ఒంటిపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉండేలా చేసి, ఆ దృశ్యాలను తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీశారు. తమ మాట వినకపోతే, ఈ అశ్లీల వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టి పరువు తీస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. ఒక బిజినెస్ ఉమెన్‌ని ఆఫీస్ గదిలో బంధించి ఇంత పైశాచికంగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది.
కేవలం వీడియోలు తీయడమే కాదు, తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. లేదంటే దొంగ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఆ కంపెనీకి చెందిన మరో ఆఫీసర్ తనపై నిరాధారమైన ఫిర్యాదులు చేశారని, అప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వేధింపుల పర్వం తట్టుకోలేకే ఇప్పుడు ఆమె ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది.
ఎన్.ఎం. జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, ఐటీ చట్టం కింద పలు కఠిన సెక్షన్లు నమోదు చేశారు. 2023 జనవరిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోంది.
This post was last modified on December 1, 2025 6:46 pm
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈసారి…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జిఓ త్వరగా వచ్చేయడంతో 1000 రూపాయల ఫ్లాట్ రేట్…
సినిమాల ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు యాంకర్లతో ప్రశ్నలు అడిగించడం లేదా స్టేజ్ మీద హడావిడి చేయడం మాత్రమే ఉండేవి. కానీ…
సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.…
కెజిఎఫ్ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న శాండల్ వుడ్ స్టార్ యష్ మార్చి 19న టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు…
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ స్టేడియంలో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. కేవలం ఒక ప్రామిసింగ్ ప్లేయర్ లా కాకుండా,…