డిస్కవరీ ఛానెల్‌లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ చూసి పెరిగిన 90s కిడ్స్ ఎవరైనా బేర్ గ్రిల్స్ ఫ్యాన్ అవ్వకుండా ఉండలేరు. అడవిలో పరుగులు, బల్లులు, పాములు ఇలా దొరికితే అది తినేసే ఈ సాహసవీరుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఏం తింటాడో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ప్రధాని మోదీ, రజినీకాంత్ లాంటి దిగ్గజాలతో అడ్వెంచర్లు చేసిన గ్రిల్స్, తాజాగా తన డైట్ సీక్రెట్ బయటపెట్టారు. అది చాలా సింపుల్‌గా, పక్కా నాచురల్‌గా ఉండటం విశేషం.
ఉదయం లేవగానే ప్రకృతిలో కాసేపు గడిపే గ్రిల్స్, బ్రేక్‌ఫాస్ట్‌లో 4 గుడ్లు వెన్నలో వేయించుకుని తింటారు. దాంతో పాటు గ్రీక్ యోగర్ట్, ప్రోటీన్ పౌడర్, బెర్రీలు, కొంచెం తేనె కలుపుకుని తీసుకుంటారు. తాజా ఆరెంజ్ జ్యూస్ కూడా తప్పనిసరి. ఇవన్నీ అతనికి కావాల్సిన ప్రోటీన్, ఎనర్జీని ఇస్తాయి. మనం అనుకున్నట్లు అతను పిజ్జాలు, బర్గర్లు జోలికి అస్సలు వెళ్లడు.
చాలామంది ఫిట్‌నెస్ కోసం కార్బోహైడ్రేట్స్ మానేస్తారు. కానీ గ్రిల్స్ మాత్రం బంగాళాదుంపలు, వైట్ రైస్, తేనె లాంటి మంచి కార్బ్స్ తీసుకుంటారు. ఇవి తన ఎనర్జీ లెవల్స్‌ని పెంచుతాయని ఆయన నమ్ముతారు. ఇక రాత్రి భోజనం విషయానికి వస్తే, మాంసం లేదా పెద్ద బేక్డ్ పొటాటో విత్ చీజ్ తీసుకుంటారట. అది కూడా రైతుల దగ్గర దొరికే సహజమైన ఆహారానికే ఓటు వేస్తానని తెలిపారు.
రాత్రి పడుకునే ముందు ఒక స్పెషల్ స్మూతీ తాగుతారట. పచ్చి పాలు ప్రోటీన్ పౌడర్, తేనె, అరటిపండు, ఐస్ వేసి బ్లెండ్ చేసుకుని తాగేస్తాడు. ఇది చాలా సింపుల్, కానీ బాడీ రికవరీకి సూపర్ ఎఫెక్టివ్. ఇక ప్రాసెస్డ్ ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆయన సూచిస్తున్నారు. అడవిలో బతకాలంటే ఏమైనా తినొచ్చు కానీ, నిత్యజీవితంలో మాత్రం ఇలాంటి సింపుల్, పౌష్టికాహారం తీసుకుంటేనే ఎవరైనా బేర్ గ్రిల్స్‌లా స్ట్రాంగ్‌గా ఉంటారని న్యూట్రిషనిస్టులు కూడా అంటున్నారు. కాంప్లికేటెడ్ డైట్స్ కాకుండా, ఇలాంటి నాచురల్ ఫుడ్ అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఈ రియల్ హీరో ప్రూవ్ చేశారు.
This post was last modified on November 30, 2025 9:13 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…