Trends

సెమీఫైనల్: బంగ్లా చేతిలో మన కుర్రాళ్ళ ‘సూపర్’ ఓటమి

​ఐపీఎల్‌లో సిక్సర్ల మోత మోగించే మన ‘స్టార్లు’ ఇవాళ బంగ్లాదేశ్ కుర్రాళ్ళ ముందు చతికిలపడ్డారు. కోట్లు పలికే మన ప్లేయర్లు, కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయకుండా సూపర్ ఓవర్‌లో ఫ్లాప్ అయ్యారు. అసలు స్కోర్ బోర్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 194/6 భారీ స్కోరు చేసింది. మనోళ్లు కూడా సరిగ్గా 194/6 కొట్టి మ్యాచ్‌ను ‘టై’ చేశారు. అది కూడా చివర్లో బంగ్లా చేసిన పొరపాటు కారణంగా టీమిండియాకి ఛాన్స్ దొరికింది. అంతా బాగుంది అనుకుంటే, సూపర్ ఓవర్ అనే లాటరీలో అట్టర్ ప్లాప్ అయ్యారు.

​ఛేజింగ్ మొదలుపెట్టినప్పుడు మనోళ్లు ఈజీగా గెలిచేస్తారనిపించింది. ప్రియాంశ్ ఆర్య (44), వైభవ్ సూర్యవంశీ (38) దంచి కొట్టారు. కానీ మధ్యలో, వరుసగా వికెట్లు పారేసుకున్నారు. గెలవాల్సిన మ్యాచ్‌ను కష్టాల్లోకి నెట్టేశారు. చివర్లో జితేష్ శర్మ (33), నెహాల్ వధేరా (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఎలాగోలా కష్టపడి మ్యాచ్‌ను ‘టై’ చేసి, లక్కుతో సూపర్ ఓవర్ దాకా తెచ్చారు.

​సరే, ఇక్కడైనా మన ఐపీఎల్ అనుభవం పనికొస్తుందనుకుంటే.. అసలు సినిమా అక్కడ మొదలైంది. సూపర్ ఓవర్ అంటే ఆరు బంతులు, దడ పుట్టించే టెన్షన్. కానీ మనోళ్లు దాన్ని కామెడీ చేశారు. బ్యాట్ పట్టుకుని దిగారు, రెండు బంతులు ఆడారు, రెండు వికెట్లు ఇచ్చేశారు. సూపర్ ఓవర్ స్కోర్: ఇండియా 0/2.

​సరే, బ్యాటింగ్లో సున్నా చుట్టారు.. కనీసం బౌలింగ్లో అయినా ఆ ఒక్క పరుగును కాపాడతారా అంటే.. అక్కడ మరో ట్విస్ట్. మన బౌలర్ సుయాష్ శర్మ మొదటి బాల్ లో వికెట్ తీసినా ఆ తరువాత ఏకంగా ‘వైడ్’ వేసి శుభం కార్డు వేశాడు. 

బంగ్లాదేశ్ సూపర్ ఓవర్ స్కోర్: 1/0 (వైడ్). బ్యాటర్లు కష్టపడకుండానే గెలిచేశారు. అటు బ్యాటింగ్‌లో డకౌట్, ఇటు బౌలింగ్‌లో వైడ్.. ఇంతకంటే దారుణమైన ఓటమి ఇంకోటి ఉండదు. ​మొన్న పాకిస్థాన్ చేతిలో కూడా దారుణమైన ఓటమే. ఇక, ఇవాళ బంగ్లాదేశ్ చేతిలో ఇలా ‘సూపర్’ ఓటమి పాలయ్యారు.

This post was last modified on November 21, 2025 9:22 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ind Vs Ban

Recent Posts

8 గంటల పని… దీపికకు వ్యతిరేకంగా భర్త

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…

21 minutes ago

మోదీ, రేవంత్, లోకేష్ కు కూడా తప్పని ఢిల్లీ తిప్పలు

ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన, రైలు రవాణా తీవ్రంగా ప్రభావితమైంది. విజిబిలిటీ భారీగా తగ్గిపోవడంతో పలు విమానాలను దారి…

2 hours ago

ఒక్క ఓటుతో కోడల్ని గెలిపించిన ‘అమెరికా మామ’

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఫలితాలు నిన్న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల ఫలితాల…

2 hours ago

చ‌ర‌ణ్‌ vs నాని.. ఇద్ద‌రూ త‌గ్గేదే లే

సినిమాలకు సంబంధించి క్రేజీ సీజ‌న్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజ‌న్‌కు బాగా…

4 hours ago

‘కూట‌మి’లో ప్ర‌క్షాళన‌.. త్వ‌ర‌లో మార్పులు?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలోనే కాదు.. పార్టీల్లోనూ ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీల ప‌రంగా పైస్థాయిలో నాయ‌కులు…

5 hours ago

జన నాయకుడు మీద ఏంటీ ప్రచారం

రాజకీయ రంగ ప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా చెప్పుకున్న జన నాయకుడు జనవరి 9 విడుదల కానుంది. మలేసియాలో…

5 hours ago