యావత్ ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికీ వచ్చేస్తోంది. వచ్చే వారంలో కరోనా వైరస్ టీకాను బ్రిటన్ లో జనాలకు అందుబాటులోకి తేవటానికి బ్రిటన్ దేశంలోని ఫార్మా కంపెనీ ఫైజర్ ఏర్పాట్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఇంగ్లాండ్ లోని జనాలకు టీకా వేయటానికి అక్కడి ప్రభుత్వం ఫైజర్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందో వెంటనే అందరి దృష్టి ఫైజర్ డెవలప్ చేసిన టీకా పై పడింది.
ఇందులో భాంగంగానే మనదేశంలోని సంపన్నులు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్న విషయం ట్రావెట్ ఏజెంట్ల ద్వారా బయటపడింది. కేవలం కరోనా వైరస్ టీకా వేయించుకోవటానికే బాగా డబ్బున్నవాళ్ళు బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అయిపోతున్నారన్న విషయం బయటపడగానే దేశంలో సంచలనమైంది. డిసెంబర్ 15 తర్వాత బ్రిటన్ వచ్చే విదేశీయులంతా కచ్చితంగా వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సిందే అనే నిబందన పెట్టింది.
ఐసొలేషన్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని బ్రిటన్ వెళ్ళాలని అనుకున్న మనదేశంలోని సంపన్నులు హోటళ్ళల్లో ఉండటానికి కూడా రెడీ అయిపోయారు. అంటే ఎంత డబ్బులు ఖర్చయినా సరే వెంటనే టీకా వేయించేసుకోవాలనే ఆతృత బయటపడుతోంది. ఈ నేపధ్యంలోనే ఫైజర్ కంపెనీ మనదేశంలో కూడా టీకాను అందుబాటులోకి తెవటానికి రెడీ అయ్యిందన్న వార్త చాలామంది హ్యాపీగా ఫీలవుతున్నారు. కరోనా వైరస్ టీకా ఇండియాలోకే వచ్చేస్తుంటే ఇక తాము బ్రిటన్ వెళ్ళాల్సిన అవసరం లేదని సంపన్నులు డిసైడ్ చేసుకోవచ్చు.
సరే ఎవరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మనదేశంలోని ఫైజర్ డెవలప్ చేసిన టీకా వచ్చేస్తోందంటే అందరు సంతోషించాల్సిందే. కాకపోతే బ్రిటన్ దేశం విస్తార్ణానికి, జనాభాకు మన దేశం విస్తీర్ణానికి, జనాభాకు చాలా వ్యత్యాసముందన్న విషయం గుర్తుంచుకోవాలి. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా వాతావరణంలో చాలా తేడా ఉంది. అందుకనే ఇండియాలో తమ టీకాను -70 డిగ్రీల ఉష్టోగ్రతలో మాత్రమే నిల్వ చేసుకోవాలని కంపెనీ హెచ్చరించింది. సరే ముందంటు టీకా వచ్చేస్తే మిగిలిన విషయాలు పెద్ద లెక్కలోవి కావు. మరి ఎప్పటిలోగా టీకా మనదేశంలోకి వచ్చేస్తుందో చూడాల్సిందే.
This post was last modified on December 4, 2020 11:16 am
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…