Trends

‘బాహుబలి’ రాకెట్: దేశానికి లాభమేమీటంటే..

రీసెంట్‌గా ఇస్రో లాంచ్ చేసిన LVM3-M5 ‘బాహుబలి’ రాకెట్ ప్రయోగం మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే, 4,410 కిలోల బరువున్న CMS-03 శాటిలైట్‌ను ఇండియా నుంచి పంపడం అనేది మామూలు విషయం కాదు. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం వల్ల, ఈ రాకెట్ దేశానికి ఎలా యూజ్ అవుతుంది, అలాగే ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే వివరాల్లోకి వెళితే..

ఫారెన్ హెల్ప్ అవసరం లేదు

గతంలో, మనం భారీ శాటిలైట్‌లను పంపాలంటే కచ్చితంగా ఫ్రాన్స్‌కు చెందిన ఏరియానె లాంటి ఫారెన్ రాకెట్స్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు మన LVM3 రాకెట్ సక్సెస్‌తో, ఆ అవసరం లేదనే సందేశం వెళ్లింది. అంటే, ‘ఆత్మనిర్భర్ భారత్’ టార్గెట్‌కు ఇది ఒక బిగ్గెస్ట్ సపోర్ట్. మన డబ్బు, మన టెక్నాలజీ, మన ప్రయోగం అని చెప్పవచ్చు.

పవర్ ఫుల్ కమ్యూనికేషన్

CMS-03 లాంటి భారీ కమ్యూనికేషన్ శాటిలైట్లను పంపడం వల్ల, ఇండియాలో ఇంటర్నెట్, డిఫెన్స్ కమ్యూనికేషన్స్ మరింత స్ట్రాంగ్‌గా మారుతాయి. ఈ శాటిలైట్ దాదాపు 15 ఏళ్ల పాటు సర్వీస్ ఇస్తుంది. మన దేశంలోని దూర ప్రాంతాలకు, చుట్టూ ఉన్న సముద్రంలో కనెక్టివిటీకి ఇది చాలా కీలకం.

LVM3 రాకెట్‌ అనేది చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశారు. ఇది 4,000 కిలోల బరువున్న శాటిలైట్‌ను హై ఆర్బిట్‌కు, 8,000 కిలోల పేలోడ్‌ను లో ఆర్బిట్‌కు తీసుకెళ్లగలదు. ఈ కెపాసిటీని ఇస్రో అతిపెద్ద మిషన్ అయిన ‘గగన్‌యాన్’ (మనుషులను స్పేస్‌లోకి పంపే మిషన్) కోసం వాడుతోంది. ఈ రాకెట్‌ను హ్యూమన్ రేటెడ్ వెర్షన్‌లో (HRLV) మార్చి వాడతారు.

బిజినెస్ బూస్ట్

LVM3 రాకెట్ ప్రతిసారీ సక్సెస్ అవుతోంది 100% సక్సెస్ రేట్ అని కూడా చెప్పవచ్చు. ఈ నమ్మకంతో, ఇస్రో ఇప్పుడు ఇతర దేశాల పెద్ద శాటిలైట్‌లను కూడా కమర్షియల్‌గా ప్రయోగించే అవకాశం దొరుకుతుంది. ఇది ఇస్రోకి బిజినెస్ పరంగా, దేశానికి ఆదాయం పరంగా పెద్ద బూస్ట్ అవుతుంది.

చంద్రయాన్ 3 ని విజయవంతంగా పంపింది కూడా ఈ రాకెట్ సిరీస్సే. అందుకే ఈ రాకెట్‌ను ‘బాహుబలి’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ఈ తాజా విజయంతో, ఇండియా ఇప్పుడు హెవీ లిఫ్ట్ లాంచర్స్‌ ఉన్న అగ్రదేశాల జాబితాలో గట్టిగా నిలబడింది.

This post was last modified on November 2, 2025 8:28 pm

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

1 hour ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

2 hours ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

3 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

3 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

4 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

4 hours ago