భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన అయ్యర్‌కు, ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా సిడ్నీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ పరిస్థితిని చూసిన వైద్యులు, ఈ గాయం ప్రాణాలకే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కారీ ఇచ్చిన క్యాచ్‌ను పట్టుకోవడానికి అయ్యర్ వెనక్కి పరిగెత్తి, డైవ్ చేశాడు. ఈ క్రమంలోనే అతని ఎడమ పక్కటెముకల భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చిన తర్వాత అయ్యర్ పరిస్థితిలో తేడా కనిపించడంతో, టీమ్ మేనేజ్‌మెంట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించింది.
ఆసుపత్రిలో రిపోర్టులు చూసిన తర్వాత, లోపల రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు వ్యాపించకుండా ఆపడానికి వెంటనే చికిత్స ప్రారంభించారు. అందుకే గత కొన్ని రోజులుగా అయ్యర్ ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉన్నారు. “పరిస్థితి నిలకడగా ఉంది, కానీ ఆలస్యం జరిగి ఉంటే ఇది ప్రాణాలకే ప్రమాదంగా మారేది” అని బీసీసీఐకి సంబంధించిన వర్గాలు తెలిపాయి.
టీమ్ డాక్టర్, ఫిజియో ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా వెంటనే స్పందించడం వల్లే ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చిందని వారు చెప్పారు. అయ్యర్ చాలా ధైర్యవంతుడని, త్వరలోనే కోలుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మొదట్లో అయ్యర్ మూడు వారాల్లో కోలుకుంటాడని అనుకున్నారు. అయితే, లోపల రక్తస్రావం జరగడం వల్ల అతను మైదానంలోకి తిరిగి రావడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది.
కాంపిటీటివ్ క్రికెట్‌లోకి ఎప్పుడు తిరిగి వస్తారో ఇప్పుడే కచ్చితమైన టైమ్‌లైన్ చెప్పడం కష్టమని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం టీ20 స్క్వాడ్‌లో అయ్యర్ లేరు. 31 ఏళ్ల అయ్యర్ ఇప్పుడప్పుడే భారత్‌కు తిరిగే అవకాశం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాతే ఫిట్‌గా ప్రకటించే అవకాశం ఉంది. కనీసం ఒక వారం పాటు ఆయన సిడ్నీ ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. శ్రేయాస్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on October 27, 2025 1:57 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…