Trends

యూరప్ వీసా రిజెక్ట్ అవుతుందా? మీరు చేసే అతిపెద్ద తప్పులివే

యూరప్ ట్రిప్ అనేది చాలామంది కల. కానీ, పారిస్ వీధుల్లో తిరగాలని కలలు కనే వేలాది మంది ట్రావెలర్స్, చివరి నిమిషంలో షెంజెన్ వీసా రిజెక్షన్ ఎదుర్కొని షాక్‌కు గురవుతున్నారు. 2024లోనే ఏకంగా 1.7 మిలియన్ల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. దీంతో పాటు, ఫీజుల రూపంలో 145 మిలియన్ల డాలర్ల డబ్బు కూడా పోయింది. ఈ ఆర్థిక నష్టాన్ని, నిరాశను తప్పించుకోవాలంటే, వీసా రిజెక్ట్ కావడానికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకోవాలి.

పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఉద్యోగ ధృవీకరణ పత్రం లాంటి ఏ ఒక్క డాక్యుమెంట్‌ను ఫేక్‌గా సబ్మిట్ చేసినా, అది మీ వీసా ఛాన్స్‌ను నాశనం చేస్తుంది. ఇది మీకు ఐదేళ్ల పాటు యూరప్‌లో ప్రవేశించకుండా బ్యాన్ కూడా పడేలా చేస్తుంది. అధికారిక, ఒరిజినల్ డాక్యుమెంట్లు మాత్రమే ఇవ్వండి. మీ విషయంలో ఏదైనా లోపాలు ఉంటే నిజాయితీగా చెప్పండి.

కేవలం ‘టూరిజం’ లేదా ‘బిజినెస్’ అని చెబితే సరిపోదు. మీరు ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఏమేం చేస్తారు అనేదానిపై అధికారులకు స్పష్టమైన వివరాలు కావాలి. అలాగే మీరు ఎక్కడెక్కడ ఉంటారు (హోటల్ బుకింగ్స్), ఏ ప్రదేశాలు చూస్తారు అనే వివరాలతో సహా డీటెయిల్డ్ ప్లాన్ ఇవ్వండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీరు చేయాలనుకుంటున్న ట్రిప్‌ ఖర్చుతో పోలిస్తే సరిపోకపోతే వీసా రిజెక్ట్ అవుతుంది. మీరు ఆర్థికంగా స్థిరంగా ఉన్నారా లేదా అని అధికారులు చూస్తారు. 

గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు, స్థిరమైన ఆదాయాన్ని చూపించండి. మీ ప్లాన్ ఖర్చు కంటే 20-30% అదనంగా డబ్బు ఉండేలా చూసుకోండి. ఇక చాలా మంది వీసాలు రిజెక్ట్ కావడానికి ఒక అతి పెద్ద కారణం ఉంది. మీరు యూరప్ నుంచి మీ దేశానికి ఖచ్చితంగా తిరిగి వస్తారని నిరూపించలేకపోతే, అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మీ సొంత దేశంతో మీకు ఉన్న బలమైన బంధాలను (ఉద్యోగం, కుటుంబం, ఆస్తులు, వ్యాపారం) చూపించే డాక్యుమెంట్లు ఇవ్వండి. రిటర్న్ టికెట్ తప్పనిసరి.

షెంజెన్ రూల్స్ ప్రకారం, ప్రతి ఒక్కరూ కనీసం $30,000 (సుమారు రూ. 30 లక్షలు) కవరేజ్ ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఇది లేకపోతే అప్లికేషన్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతుంది. వీసాకు అప్లై చేసే ముందే, పూర్తి కవరేజీతో కూడిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనండి. ఇక మీరు గతంలో ఎప్పుడైనా వీసా నిబంధనలను ఉల్లంఘించినా (ఓవర్‌స్టే, డెపోర్టేషన్), లేదా మీకు చిన్నపాటి క్రిమినల్ రికార్డ్ ఉన్నా, అది మీ వీసా అప్రూవల్‌ను అడ్డుకుంటుంది. 

అయిత్ర్ SIS అలర్ట్ (Schengen Information System) లో మీ పేరు ఉంటే, అది మీకు సమస్య అవుతుంది. గత సమస్యలను పరిష్కరించుకుని, ప్రశాంతమైన రికార్డు ఉండేలా చూసుకోండి. సరైన ప్లానింగ్, పూర్తి నిజాయితీతో కూడిన డాక్యుమెంట్లు ఇస్తే మీ యూరప్ కల ఖచ్చితంగా నిజమవుతుంది.

This post was last modified on October 26, 2025 7:14 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Europe visa

Recent Posts

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

11 minutes ago

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…

28 minutes ago

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…

59 minutes ago

అఖండ ప్లానింగ్… అక్క‌డ సూప‌ర్… కానీ ఇక్క‌డ‌?

పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల‌స్యం కావ‌డం ఇటీవ‌ల పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు…

1 hour ago

అధికారం వచ్చి ఎన్ని నెలలు అయినా ప్రజల మధ్యే సీఎం

అధికారంలోకి రాక‌ముందు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వ‌చ్చిన త‌ర్వాత కూడా నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను…

2 hours ago

డాలర్ @ 90: మీ జేబుకు చిల్లు పడేది ఎక్కడో తెలుసా?

"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…

2 hours ago