భారత క్రికెట్ జట్టు చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోందని.. అందులోనూ అగ్ర జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోందని అభిమానులు తెగ ఉత్సాహం చూపించారు. గత ఆస్ట్రేలియా పర్యటనలో మన జట్టు చారిత్రక విజయాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే ఆశించారు ఫ్యాన్స్. కానీ వారి అంచనాలు, ఆశలకు భిన్నమైన ప్రదర్శన చేస్తోంది కోహ్లీసేన.
తొలి మ్యాచ్ కాబట్టి ఇంకా పరిస్థితులకు అలవాటు పడక ఓడిపోయారేమో అనుకుంటే.. రెండో మ్యాచ్‌లో ఇంకా పేలవమైన ప్రదర్శన చేశారు. రెండో వన్డేలో కూడా పేలవమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో మ్యాచ్ తొలి అర్ధ భాగంలోనే ఓటమి ఖాయం చేసుకున్నారు. తర్వాత బ్యాట్స్‌మెన్ పోరాడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఫలితం లేకపోయింది.
ఐతే ఈ మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైనా ఒక దృశ్యం మాత్రం మ్యాచ్‌ను ప్రత్యక్షంగా స్టేడియంలో, పరోక్షంగా టీవీల ద్వారా చూస్తున్న వాళ్లందరికీ అమితానందాన్ని కలిగించింది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఒక భారతీయుడు.. స్టేడియంలో అందరి ముందు తన ఆస్ట్రేలియన్ ప్రేయసికి పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె ముందు ఆశ్చర్యపోయి, తర్వాత అతడి ప్రపోజల్‌కు అంగీకరించింది. తర్వాత ఇద్దరూ కౌగిలించుకున్నారు. చాలా ఆహ్లాదంగా కనిపించిన ఈ దృశ్యం కామెంటేటర్లనే కాదు.. మైదానంలో ఉన్న ఆటగాళ్లను సైతం ఆకర్షించింది. కాసేపు మ్యాచ్ కామెంట్రీ ఆపేసి వీళ్ల గురించి వ్యాఖ్యాతలు మాట్లాడారు.
బౌండరీల దగ్గరున్న ఆటగాళ్లు కొందరు ఈ దృశ్యం చూశారు. మ్యాక్స్‌వెల్ అయితే చప్పట్లు కొట్టి ఆ జంటను అభినందించాడు. సోషల్ మీడియాలో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 7:13 am
ది హైప్ ఈజ్ రియల్ అనేది సాధారణంగా ఒక పెద్ద సినిమాకున్న అంచనాలను వర్ణించేందుకు అభిమానులు వాడుకునే స్టేట్ మెంట్.…
దేశంలో రిజర్వేషన్ల పరిమితి 50 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. ఏ రిజర్వేషన్ అయినా.. 50 శాతానికి మించి ఇవ్వడానికి…
తండేల్ విడుదల తేదీ ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ మీట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు టీమ్ పంచుకుంది.…
ఈ దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పడ్డాయి. వాటికి మంచి వసూళ్లు కూడా వచ్చాయి.…
మరో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తిగా బడ్జెట్ సమావేశాలేనని కూటమి సర్కారు చెబుతోంది. వచ్చే మార్చి…
దసరా బ్లాక్ బస్టర్ తో నానికి మొదటి వంద కోట్ల గ్రాసర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రెండోసారి న్యాచురల్…