కలం హాలికులుగా సమాజ చైతన్యానికి నిరంతరం చెమటోడుస్తున్న జర్నలిస్టులకు ఏ చిన్న సమస్య వచ్చినా.. నేనున్నానంటూ ముందుకు వచ్చే వారే ఆపన్నులు. నేనున్నానంటూ.. అండగా నిలిచేవారే.. పాత్రికేయులకు ఆపత్బాంధవులు. అలాంటి వారిలో మిన్నగా.. ముందుండే.. జర్నలిస్టు.. వరికుప్పల రమేష్(ఈనాడు). సుదీర్ఘ కాలంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న రమేష్.. జర్నలిస్టు మిత్రులకు తల్లో నాలుక అనడంలో సందేహం లేదు.
ఎవరికి ఎక్కడ ఆపద వాటిల్లినా.. నేనున్నానంటూ ఆయన స్పందిస్తారు. ఆపన్నహస్తం అందిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్యానల్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి(జనరల్ సెక్రటరీ) పదవికి వరికుప్పల రమేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పదవుల కోసం కాకుండా.. పనిచేయడం కోసమే బరిలో నిలిచిన రమేష్‌వంటి వారిని గెలిపించుకోవడం.. ప్రతిపాత్రికేయుడి ధర్మం. ` చేసేదే చెబుతాం.. చెప్పిందే చేస్తాం.. నినాదంతో పాత్రికేయుల కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన రమేష్‌ను మన ఓటుతో గెలిపిద్దాం.. మనకోసం సేవ చేసే అవకాశం కల్పిద్దాం.
ఈ నెల 26న జరగనున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఫ్రండ్స్ ప్యానెల్‌పై సీరియస్ నెంబరు 4లో పోటీలో ఉన్న ఈనాడు పాత్రికేయుడు వరికుప్పల రమేష్‌కు ఓటు వేయడం అంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమే, మన కోసం నిరంతరం పనిచేసే వారిని, ఆలోచించే వారిని ఎంచుకోవడమేనన్న విషయాన్ని ప్రతి పాత్రికేయుడు గుర్తుంచుకోవాలి. సీరియస్ నెంబరు 4కు ఓటు వేయడం అంటే.. మన జర్నలిస్టుగా పేరు తెచ్చుకుని.. అందరిలోనూ కలిసిపోయే రమేష్ ను గెలిపించడంతోపాటు.. ప్రతి పాత్రికేయుడు తనను తాను గెలిపించుకోవడమే అవుతుంది. ఆలోచించండి.. రమేష్‌కు మద్దతుగా నిలవండి!. మన అందరి కోసం రమేష్ ప్రయత్నాన్ని సమర్థించే రమేష్ మిత్రమండలి ప్రత్యేక వినతి ఇది.
పోలింగ్ తేదీ: ఈ నెల 26
రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీరియల్ నెంబరు : 4
This post was last modified on October 24, 2025 1:43 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…