టీమిండియా కింగ్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి తప్పుకోబోతున్నారనే పుకార్లు ఈమధ్య క్రికెట్ ప్రపంచాన్ని ఉపేశాయి. ఈ రూమర్లకు కారణం, కోహ్లీ తన ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉన్న ఒక కమర్షియల్ డీల్‌ను రిన్యూ చేయడానికి నిరాకరించడమే. ఈ వార్త రాగానే 2008 నుంచి ఆర్‌సీబీకి ఆడుతున్న ఈ లెజెండ్ ఐపీఎల్‌కు వీడ్కోలు చెబుతున్నారేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇక ఆకాష్ చోప్రా వంటి క్రికెట్ నిపుణులు మాత్రం ఈ వార్తలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కోహ్లీ రిజెక్ట్ చేసింది ఆటగాడిగా ఉన్న కాంట్రాక్ట్‌ను కాదు, కేవలం కమర్షియల్ ప్రమోషన్స్‌కు సంబంధించిన ఒప్పందాన్ని మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఈమద్యే కదా ఆర్‌సీబీకి ట్రోఫీ అంధించారు. ఇప్పుడెందుకు జట్టును వదిలేస్తారు? అని చోప్రా ప్రశ్నించారు. ఆటగాడిగా కోహ్లీ ఆర్‌సీబీకి కమిట్‌మెంట్ ఇచ్చారని, వ్యాపార లావాదేవీల నుంచే ఆయన దూరం అవుతున్నారని వివరించారు.
అయితే, కోహ్లీ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం, 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్‌కు కూడా గుడ్‌బై చెప్పడం చూస్తే, ఆయన కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వాదన బలంగా ఉంది. 36 ఏళ్ల వయసులో ఉన్న కోహ్లీ తన వర్క్‌లోడ్‌ను తగ్గించుకోవాలని, కుటుంబంపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నారని, అందుకే ఐపీఎల్ నుంచి కూడా త్వరలో తప్పుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారు.
మరోవైపు, ఆర్‌సీబీకి 2025 సీజన్‌లో చారిత్రక టైటిల్ గెలిచిన తర్వాత, కోహ్లీ స్వయంగా “ఐపీఎల్‌లో నా చివరి రోజు వరకు ఆర్‌సీబీ కోసమే ఆడతాను” అని చెప్పడం ఈ పుకార్లకు కొంత విరుద్ధంగా ఉంది. ఈ వ్యాఖ్యను బట్టి చూస్తే, ఆయన వెంటనే రిటైర్ అవ్వట్లేదని, కానీ రాబోయే రోజుల్లో ఆర్‌సీబీ తన ప్రమోషనల్ ప్లాన్స్‌లో తనపై ఆధారపడకుండా ఉండటానికి సూచన మాత్రమే ఇచ్చారని అర్థమవుతోంది. అంటే కమర్షియల్ గా విరాట్ ఫొటోను RCB ఎక్కడ వాడుకోకూడదు అనేలా కోహ్లీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
This post was last modified on October 16, 2025 6:47 am
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…