భారత క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ మరోసారి తన ఫిట్‌నెస్‌తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా బీసీసీఐ పరిచయం చేసిన కొత్త బ్రోంకో టెస్ట్లో పాల్గొన్న ఆయన ఫలితం బయటకు వచ్చింది. ఈ టెస్ట్‌లో రోహిత్ కేవలం పాస్ అవ్వడమే కాకుండా, తన ప్రదర్శనతో అక్కడి కోచింగ్ స్టాఫ్‌ను కూడా మెప్పించాడని సమాచారం.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆగస్టు 30, 31 తేదీల్లో ఆటగాళ్లందరికీ యో-యో టెస్ట్‌తో పాటు కొత్త బ్రోంకో టెస్ట్ కూడా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఆటగాడు విజయవంతంగా పూర్తి చేశారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా 38 ఏళ్ల రోహిత్ తన శారీరక ఆకృతి, స్టామినాతో అందరినీ ఆకట్టుకున్నాడట. ఈ టెస్ట్‌లో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణా కూడా అద్భుతంగా ప్రదర్శించినట్లు సమాచారం.
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పాడు. దాదాపు సంవత్సరం తర్వాత టెస్టుల నుంచీ కూడా రిటైర్ అయ్యాడు. కానీ వన్డే ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2025లో కూడా ఆడాడు. అయితే రోహిత్ భవిష్యత్‌పై అనేక రకాల ఊహాగానాలు వస్తుండగా, ఈ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఆయనకే కాదు అభిమానులకు కూడా ఊరటనిచ్చేలా ఉంది.
అక్టోబరులో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ పాల్గొననున్నాడు. కానీ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 మధ్య కన్పూర్‌లో జరిగే ఇండియా-ఎ వర్సెస్ ఆస్ట్రేలియా-ఎ వన్డేల్లో ఆయన ఆడతారో లేదో స్పష్టత రాలేదు. మొత్తానికి, రోహిత్ శర్మ తన వయసును మించి ఫిట్‌నెస్‌తో మరోసారి నిరూపించుకున్నాడు. ఏదేమైనా రాబోయే సిరీస్‌ల్లో రోహిత్ ఆటను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates