అమెరికా విద్యార్థి వీసాలపై పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభమయ్యాయి. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. అమెరికా కొత్త విధానాలు విద్యార్థులపై ఆర్థిక, విద్యా, వ్యక్తిగత స్థాయిలో ప్రభావం చూపుతున్నాయి. దేశ భద్రత పేరుతో తీసుకున్న చర్యలు నిజంగా అంతర్జాతీయ విద్యార్థుల హక్కులకు ముప్పు తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రద్దైన వీసాలలో 4,000 మంది దేశ చట్టాలు ఉల్లంఘించడం, మత్తులో వాహనాలు నడపడం, దాడులు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడటం కారణమని సమాచారం. అదనంగా ఐఎన్‌ఏ 3బీ చట్టం కింద ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన 300 మందికిపైగా విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద మద్దతు ఇస్తున్నారు. గత ఏడాది గణాంకాల ప్రకారం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. వీరి ద్వారా 43.8 బిలియన్ డాలర్లు అమెరికా సంపాదించింది. మొత్తం విద్యార్థుల్లో సుమారు 6 శాతం అంతర్జాతీయ విద్యార్థులే. అయినా కూడా పాలసీల కఠినతరం వల్ల వారి భవిష్యత్తు అనిశ్చితంగా మారుతోంది.
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న సమయంలో ఈ నిర్ణయం రావడం విద్యార్థుల వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు వేగవంతమయ్యాయి. ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని కఠినమైన పాలసీలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులపై పర్యవేక్షణ పెంచారు. జనవరిలో యాంటీ సెమిటిజం వ్యతిరేక బిల్లు పాస్ చేసి, పాలస్తీనా మద్దతు ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై దేశ బహిష్కరణ చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు.
జూన్‌లో ట్రంప్ కార్యవర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను నిలిపివేసింది. విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లు తప్పనిసరిగా బహిర్గతం చేయాలని ఆదేశించింది. వారి పోస్టులు, కామెంట్లు, లైకులను పరిశీలించి మాత్రమే వీసా మంజూరు చేసే విధానం అమల్లోకి వచ్చింది. దీని వల్ల స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు విద్యార్థులకు కష్టంగా మారింది.
క్యాంపస్‌లలో కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పాలస్తీనా మద్దతు ఆందోళనల్లో పాల్గొన్న అనేక మంది విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేశారు. హార్వర్డ్ సహా కొన్ని ప్రధాన విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులను నియమించడాన్ని నిలిపివేశాయి. దీనిపై విశ్వవిద్యాలయాలు మరియు ట్రంప్ ప్రభుత్వం మధ్య న్యాయపోరాటం కొనసాగుతోంది.
This post was last modified on August 19, 2025 6:32 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…