రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతోంది. దీనిని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రంగంలోకి దిగారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు యూరప్ దేశాల నేతలతో చర్చించిన అనంతరం, త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్‌స్కీ భేటీ జరగనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ యుద్ధాన్ని ముగించే దిశగా ఒక కీలక ముందడుగని ఆయన అభివర్ణించారు. అమెరికా సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని ట్రంప్ చెప్పడం, తన పాత్రను పెద్దది చేసి చూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.
ఇదివరకే భారత్ – పాక్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి వస్తే తానే ఆపానని ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. భారత్ మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ట్రంప్ తనదైన శైలిలో “నేనే ఆపాను” అన్న బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ విషయంలో కూడా అదే తరహాలో వెళ్తూ, తాను మధ్యవర్తిగా లేకపోతే ఈ యుద్ధం పెరిగిపోయేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు విషయ ఏమిటంటే, ఈ శాంతి చర్చల వెనుక అమెరికాకు కూడా లాభమే. మొదటగా, యుద్ధం ముగిస్తే యూరప్ అంతటా ఇంధన ధరల ఒత్తిడి తగ్గుతుంది. దాంతో అమెరికా శక్తివంతమైన “పీస్ మేకర్”గా గుర్తింపు పొందుతుంది. రెండవది, ఈ ఒప్పందాన్ని తన విజయంగా చూపించుకుని ట్రంప్ ప్రపంచ దేశాల ముందు రాజకీయంగా లాభపడతారు.
అదే సమయంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. యూరప్ దేశాలను తన చుట్టూ ఉంచుకోవడం, నాటోలో అమెరికా ఆధిపత్యం కొనసాగించడం ఈ ప్రక్రియతో సులభమవుతుంది. మరోవైపు రష్యాతో నేరుగా చర్చలు జరగడం వల్ల అమెరికా అంతర్జాతీయ సమీకరణల్లో కేంద్రస్థానం దక్కించుకుంటుంది. ముఖ్యంగా పెరుగుతున్న చైనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఈ లాభాలు అమెరికాకు మరింత అవసరం.
అలాగే గ్లోబల్ మార్కెట్ స్థిరపడితే అమెరికా బిజినెస్‌లకు పెద్ద లాభం ఉంటుంది. ప్రస్తుతం అనిశ్చితి కారణంగా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నాయి. కానీ యుద్ధం తగ్గితే, గ్లోబల్ ట్రేడ్ సులభమై, అమెరికా దిగుమతులు, ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా టెక్ కంపెనీలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఫార్మా రంగాలకు విపరీతమైన లాభం చేకూరుతుంది. మొత్తానికి, పుతిన్ జెలెన్‌స్కీ భేటీ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది ఇంకా స్పష్టత రాకపోయినా, ట్రంప్ ఇప్పటికే దీన్ని తన విజయంగా ప్రదర్శించడం ప్రారంభించారు. ఆయన ప్రపంచం ముందు శాంతి కర్తగా నిలబడతారా? లేక మళ్లీ బిల్డప్ ట్యాగ్ అందుకుంటాడా అనేది హాట్ టాపిక్ గా మారుతోంది.
This post was last modified on August 19, 2025 7:54 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…