అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్ల హవా నడుస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్లు వినియోగించే దేశాల్లో ఒకటైన అమెరికాలో భారతీయ ఫోన్లు బలంగా అడుగుపెడుతున్నాయి. 2024 మొదటి ఐదు నెలల్లో భారత్ అమెరికాకు 21.3 మిలియన్ యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసింది. అంతేకాదు, మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 36 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయానికి ఇది కేవలం 11 శాతమే. ఇదే సమయంలో చైనా దిగుమతులు భారీగా పడిపోయాయి.
చైనా ఇప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఫోన్లు సరఫరా చేస్తున్నప్పటికీ.. అది తగ్గే దశలో ఉంది. జనవరి నుంచి మే మధ్య చైనా ఎగుమతులు 29.4 మిలియన్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం తగ్గుదల. ఇక మొత్తంగా 10 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు చైనా పంపించగా, భారత్ నుంచి 9.35 బిలియన్ డాలర్ల ఫోన్లు వెళ్లాయి. మార్కెట్ వాటా దృష్ట్యా భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, వియత్నాం 14 శాతంతో మూడో స్థానంలో ఉంది.
అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్లలో అధిక శాతం యాపిల్ ఫోన్లే. గతంలో యాపిల్ పూర్తిగా చైనాపైనే ఆధారపడితే, ఇప్పుడు భారత్‌పై దృష్టి పెట్టింది. దీనికి ప్రధాన కారణం కేంద్రం అమలు చేస్తున్న ఉత్పత్తి ప్రోత్సాహకాల పథకం (PLI). ఇది భారతీయ మానుఫ్యాక్చరింగ్ రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారింది. మొదట పాత మోడళ్లను మాత్రమే తయారు చేసిన యాపిల్, ఇప్పుడు ప్రో మోడళ్లను కూడా భారత్‌లోనే తయారు చేస్తోంది.
యాపిల్ ఉత్పత్తి వ్యూహాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓవిధంగా తప్పుపట్టారు. ఐఫోన్లు అమెరికాలో తయారు చేయాలని, లేనిపక్షంలో భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయినా కూడా టిమ్ కుక్ నేతృత్వంలోని యాపిల్ కంపెనీ భారతీయ తయారీదారులనుే అభిముఖంగా మార్చుకుంది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి సంస్థల ద్వారా యాపిల్ తయారీ విస్తరిస్తోంది.
తాజాగా ఫాక్స్‌కాన్ తమిళనాడులో కొత్త ప్లాంట్ కోసం రూ.12,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. దీనితో భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కవేళ ఇదే తీరు కొనసాగితే.. వచ్చే సంవత్సరంలో భారత్ అమెరికా మొబైల్ మార్కెట్‌ను డామినేట్ చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉండవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates