Trends

ఇండియా టూ అమెరికా.. 10,382 మంది అరెస్ట్!

అగ్రరాజ్యం అమెరికా అంటేనే ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల దేశం. మెరుగైన జీవనవేగం కోసం, సంపద కోసం, భవిష్యత్తు కోసం వేలాదిమంది అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అమెరికాలోకి నేరుగా వీసాలు లేకుండా ప్రవేశించడం నేరం. అయినా మన దేశం నుండి, ముఖ్యంగా గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి చాలా మంది ఈ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా విడుదలైన అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ నివేదిక ప్రకారం.. 2025లో జనవరి నుండి మే మధ్యవరకూ 10,382 మంది భారతీయులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తూ పట్టుబడ్డారు. వీరిలో 30 మంది మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి 34 వేల మందికిపైగా అరెస్టయిన సంగతి తెలిసిందే. 

ఈ సంవత్సరం ఈ సంఖ్యలో 70 శాతం తగ్గుదల కనిపించడంతో, ట్రంప్‌ పాలనలో భద్రతా చర్యలు ఎంత కఠినమయ్యాయో తెలుస్తోంది. గతంలో రోజుకు సగటున 230 మంది భారతీయులను అరెస్ట్ చేస్తే, ఇప్పుడది 69కి తగ్గింది. ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడం, హారిస్ ఓటమి ఖాయమని భావించిన సందర్భం నుంచే మానవ అక్రమ రవాణా ముఠాలు తమ కార్యకలాపాలను తగ్గించుకున్నట్లు పత్రికలు వెల్లడించాయి.

ఇక, 2024 ఆర్థిక సంవత్సరానికి గాను 500 మంది మైనర్ బాలబాలికలను తల్లిదండ్రులు వదిలేసిన కేసులు వెలుగుచూశాయి. తమ పిల్లలకైనా పౌరసత్వం దక్కుతుందన్న ఆశతో ఇలా విడిచి వెళ్తున్నారు. వీరిని అమెరికా అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. చాలా మంది పిల్లలు 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్నవారే. అతి కొద్దిమంది మాత్రం చిన్న వయస్సులోనే ఈ ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు.

అలాగే అక్రమ వలస దారుల భయంకర ప్రయాణాల కథలు మనసును కలచివేస్తున్నాయి. మే 9న కాలిఫోర్నియాలో ఓ పడవ బోల్తాపడి, భారత్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు, 10 ఏళ్ల బాలిక మరణించారు. అన్నా-చెల్లెళ్లు అయిన ఈ చిన్నారులు మెక్సికో నుంచి బోటులో సముద్రం దాటుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒకటి కాదు.. ఇలాంటివి అనేకం జరుగుతూనే ఉన్నాయి.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం సుమారు 2.2 లక్షల మంది భారతీయులు డాక్యుమెంట్లు లేకుండా జీవిస్తున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు 332 మందిని మాత్రమే వెనక్కి పంపగలిగారు. ఇది చాలా తక్కువ సంఖ్య. అయినప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదు. అవకాశాల కోసం అమెరికాకు వెళ్లాలనుకోవడం తప్పు కాదు.. కానీ ప్రాణాలను ఫణంగా పెట్టి, పిల్లలను ప్రమాదంలో నెట్టడం నిజంగా బాధాకరం.

This post was last modified on July 2, 2025 9:13 pm

Share
Show comments
Published by
Kumar
Tags: IndiansUSA

Recent Posts

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

39 minutes ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

43 minutes ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

46 minutes ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

54 minutes ago

ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!

ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్‌కు…

1 hour ago

మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు 'ఫ్రీ బీస్‌' ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది.…

1 hour ago