టాలీవుడ్లో ఎంతో వేడుకగా జరిగిన సెలబ్రెటీ పెళ్ళిళ్ళలో కొణిదెల నిహారిక-చైతన్యలది ఒకటి. నాగబాబు తనయురాలైన నిహారికకు, చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడికి 2020లో ఆడంబరంగా పెళ్లి చేశాయి ఇరు కుటుంబాలు. కానీ మూడేళ్లకే వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇక అప్పట్నుంచి నిహారిక సింగిల్‌గానే ఉంటోంది. నిహారికది చిన్న వయసే కావడంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలని శ్రేయోభిలాషులు కోరుకుంటూ ఉంటారనడంలో సందేహం లేదు.
కూతురు విడాకులు తీసుకున్నాక ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ పెద్దగా స్పందించని నాగబాబు.. తొలిసారిగా దీనిపై స్పందించారు. నిహారిక తొలి వివాహం విఫలం కావడం.. ఆమె రెండో పెళ్లి చేసుకోవడం గురించి ఆయన మాట్లాడారు. తన కూతురు పెళ్లి విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అభిప్రాయపడ్డారు. నిహారిక, చైతన్యలను ప్రాపర్‌గా జడ్జ్ చేయలేకపోయామని ఆయన అన్నారు. పరస్పర అంగీకారంతోనే వాళ్లిద్దరూ విడిపోయారని.. ఇప్పుడిప్పుడే నిహారిక దాన్నుంచి తేరుకుంటోందని నాగబాబు అన్నారు.
ఏదో ఒక రోజు నిహారిక ఇంకో అబ్బాయిని కలుస్తుందని.. పెళ్లి చేసుకుంటుందని.. వారి విషయాల్లో తాను ఇన్వాల్వ్ కావాలనుకోవట్లేదని నాగబాబు స్పష్టం చేశారు. పిల్లలకు నచ్చినట్లుగా వాళ్లు జీవించాలని తాను కోరుకుంటానని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు వ్యాఖ్యానించారు. విడాకుల సమయంలో కొంత కాలం నిహారిక బయట కనిపించలేదు. కానీ తర్వాత తేరుకుని ప్రొడక్షన్ మీద దృష్టిపెట్టింది. గత ఏడాది ఆమె నిర్మాణంలో తెరకెక్కిన ‘కమిటీ కుర్రాళ్ళు’ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా ఆమె ఓ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 23, 2025 1:28 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…