ఉత్తర్ ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. పెళ్లయిన కొత్తలోనే భార్య ప్రియుడితో పారిపోయింది. అయితే దీనిపై భర్త స్పందించిన తీరు సంచలనంగా మారింది. “హనీమూన్‌కు తీసుకెళ్లి రాజా రఘువంశీలా హత్య చేయలేదని బతికి బయటపడ్డాను” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఇటీవల మెఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసును మరోసారి గుర్తు చేస్తోంది.
మే 17న సునీల్ అనే యువకుడికి స్థానికంగా 20 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. అయితే ఆమె కేవలం తొమ్మిది రోజులకే పుట్టింటికి వెళ్ళినట్టు చెప్పి, అక్కడి నుంచే ప్రియుడితో పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ ప్రారంభించిన సమయంలో ఆ యువతి స్వయంగా తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందుకు వచ్చింది. తాను అతనితోనే జీవించాలనుకుంటున్నానని స్పష్టం చేసింది.
ఈ విషయాన్ని అంగీకరించిన సునీల్ మీడియాతో మాట్లాడుతూ “ఇంకా నయం.. హనీమూన్‌కు తీసుకెళ్లి చంపలేదు. నేను హనీమూన్‌కు ప్లాన్ చేసినా, ఆమె అప్పటికే పారిపోయింది. లేకపోతే మరొక రాజా రఘువంశీలా నేను కూడా హతమయ్యేవాడిని. బతికిపోయాను అనిపిస్తుంది” అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అతని స్పందనలో బాధ కన్నా ఉపశమనమే ఎక్కువగా కనిపించింది.
ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారంతో విడిపోయాయి. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలు, కానుకలను వెనక్కు తీసుకున్నాయి. వివాదం పెద్దగా కావడం లేదని, ఫిర్యాదు ఉపసంహరించడంతో చట్టపరంగా ఎలాంటి చర్యలు అవసరం కాలేదని బిసౌలీ పోలీసు అధికారి హరేంద్రసింగ్ తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రేమ, వివాహాల నేపథ్యంలో వచ్చే మోసాలు, హత్యలు ఎక్కువవుతున్నాయి. కానీ ఈ ఘటనలో విషాదం జరగకుండానే ముగిసిన తీరు, సునీల్ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on June 18, 2025 7:29 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…