వరకట్న వేధింపుల కేసుతో మానసికంగా కుంగిపోయిన ఓ యువకుడు వినూత్న రీతిలో న్యాయ పోరాటం మొదలుపెట్టాడు. రాజస్థాన్‌లోని అంటా పట్టణంలో కృష్ణ కుమార్ ధాకడ్ అనే వ్యక్తి తన అత్తవారింటి వీధిలోనే ‘498ఏ టీ కేఫ్’ అనే పేరుతో టీ దుకాణం ప్రారంభించాడు. చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతున్న ఈ అల్లుడు, తనపై పెట్టిన కేసులు, న్యాయ వ్యవస్థలో జరిగే జాప్యం వల్ల ఎదుర్కొంటున్న బాధను చాటుతూ నిరసన చేపట్టాడు. అతడి మాటల్లోనే, “నాకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది” అనే నినాదం ఆకట్టుకుంటోంది.
కృష్ణ కుమార్ తన భార్య మీనాక్షి మాలవ్‌ను 2018లో వివాహం చేసుకున్నాడు. అనంతరం వారు కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారం ప్రారంభించారు. మహిళలకు ఉపాధి కల్పిస్తూ, వ్యాపారాన్ని విజయవంతంగా నడిపారు. అయితే 2022లో మీనాక్షి ఇంటిని వదిలి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కృష్ణపై ఐపీసీ 498ఏ (వరకట్న వేధింపులు) మరియు సెక్షన్ 125 (భరణం) కింద కేసులు నమోదు చేయడంతో కృష్ణ జీవితం తలకిందులైంది.
తాను మూడు సంవత్సరాలుగా న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నానని, తన వద్ద ఏమీ మిగలలేదని కృష్ణ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తన చుట్టూ పోస్టర్లు ఏర్పాటు చేసి “125 కింద ఎంత ఖర్చు పెట్టాలో చర్చిద్దాం” అని పేర్కొంటూ చాయ్ తాగే కస్టమర్లతో తన బాధను పంచుకుంటున్నాడు.
తన నిరసన మానవీయ కోణాన్ని కలిగి ఉంటుందని చెబుతున్న కృష్ణ, “నన్ను చట్టాన్ని దుర్వినియోగం చేసి ఇరికించిన ప్రాంతంలోనే టీ కొట్టు పెట్టడం ద్వారా న్యాయాన్ని కోరుతున్నాను” అని పేర్కొన్నాడు. నీమచ్‌లోని అథానా నుంచి ప్రతి కోర్టు వాయిదా కోసం 220 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నానని, కానీ వాయిదాలే తప్ప న్యాయం దొరకడం లేదని వాపోయాడు.
ఇదే సమయంలో, అతని భార్య మీనాక్షి మాలవ్ మాత్రం వేరే ఆరోపణలు చేస్తోంది. భూమి కొనేందుకు తన తండ్రిని డబ్బు అడిగాడని, తిరస్కరించడంతో తను తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది. విడాకులకు తాను సిద్ధమని, కానీ తన పేరిట తీసుకున్న అప్పులన్నీ తొలుత చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం ‘498ఏ టీ కేఫ్’ అనే ఈ వినూత్న నిరసన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఈ కథ వైరల్ అవుతోంది.
This post was last modified on June 14, 2025 1:53 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…