గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ వద్ద క్రాష్ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
అహ్మదాబాద్ నుండి లండన్ కు 242 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ అయిందని తెలుస్తోంది. కొన్ని బిల్డింగ్ లపై విమానం క్రాష్ లాండ్ అయిందని తెలుస్తోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ, పోలీసు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates